క్రీడాభూమి

ఆసియా జూ.బాక్సింగ్‌లో 6 పతకాలు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఫిలిప్పీన్స్‌లోని పుయెర్టో ప్రినె్ససాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఆరుగురు భారతీయులు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. వేర్వేరు విభాగాల్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లలో భవేష్ కట్టిమణి (52 కిలోలు), అమన్ షెరావత్ (70 కిలోలు), వినీత్ దహియా (75 కిలోలు), అక్షయ్ సివచ్ (60 కిలోలు), సిద్ధార్థ్ మాలిక్ (48 కిలోలు), సత్యేందర్ రావత్ (80 కిలోలు) తమ తమ ప్రత్యర్థులను మట్టికరిపించి మెడల్ రౌండ్‌కు చేరుకోవడంతో భారత్‌కు ఆరు పతకాలు ఖాయమయ్యాయి. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో అమన్ కిర్గిస్థాన్‌కు చెందిన బైబెక్ అనర్బెక్‌ను చిత్తు చేయగా, వినీత్ జోర్డాన్‌కు చెందిన రషీద్ స్వైసత్‌పై, అక్షయ్ థాయిలాండ్‌కు చెందిన సుమటాస్ ఆన్‌టాంగ్‌పై, సిద్ధార్థ్ కొరియాకు చెందిన సియో డాంగెయున్‌పై, భవేష్ మంగోలియాకు చెందిన ఎంక్తర్‌పై, సత్యేందర్ కొరియాకి చెందిన ఊన్ హ్యున్ కిమ్‌పై విజయం సాధించి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు.