క్రీడాభూమి

వరల్డ్ జూ.రెజ్లింగ్‌లో మంజుకి కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఫిన్లాండ్‌లోని టాంపెరేలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన మంజు కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 59 కిలోల విభాగంలో పోటీ పడుతున్న ఆమె కాంస్య పతకం కోసం గురువారం రాత్రి జరిగిన బౌట్‌లో 2-0 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన ఇలోనా ప్రొకొపెవ్‌నియుక్‌ను మట్టికరిపించింది. ఈ ఈవెంట్‌లో తొలుత 5-1 తేడాతో బల్గేరియాకి చెందిన అలెక్సాండ్రినా నికొలయెవా కషినోవాను మట్టికరిపించిన మంజు కుమారి క్వార్టర్ ఫైనల్ దశలో జపాన్‌కు చెందిన యుజురు కుమనో చేతిలో 0-10 తేడాతో పరాజయం పాలైంది. అయితే ఆ తర్వాత జపాన్ రెజ్లర్ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో రెప్చేజ్ రూపంలో మరో అవకాశాన్ని అందుకున్న మంజు దానిని చక్కగా సద్వినియోగం చేసుకుంది. రెప్చేజ్ బౌట్‌లో ఆమె 4-0 తేడాతో కెనడాకు చెందిన టియన్నా గ్రేస్ కెనె్నట్‌ను చిత్తుచేసి మెడల్ రౌండ్‌లో ప్రవేశించింది. ఇదిలావుంటే, ఈ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన దివ్య తొమర్ (44 కిలోల విభాగం), నందిని సలోఖే (51 కిలోలు), పూజా దేవి (67 కిలోలు) మెడల్ రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు.

చిత్రం.. మంజు కుమారి