క్రీడాభూమి

డోప్ దోషి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఉసేన్ బోల్ట్‌ను ఓడించి, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్ టైటిల్‌ను గెల్చుకున్నప్పటికీ జస్టిన్ గాల్టిన్ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. గతంలో డప్ పరీక్షలో పట్టుబడిన అతను కొన్నాళ్లు సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నాడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో బోల్ట్ ఓడిపోడాన్ని జీర్ణించుకోలేకపోయిన వేలాది మంది ప్రేక్షకులు గాల్టిన్‌ను గేలి చేశారు. డోప్ దోషికి అందలమా అంటూ విమర్శలు గుప్పించారు. ‘గాల్టిన్ ఇలాంటి రేస్‌లకు అనర్హుడు’ అని నినదించారు. అతను పతకాన్ని తీసుకోవడానికి పోడియం వద్దకు వెళుతున్నప్పుడూ కూడా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది అతనిని హేళన చేశారు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి పట్టుబడిన అతనిది నిజమైన విజయం కాదని వ్యాఖ్యానించారు.