క్రీడాభూమి

బోల్ట్‌కు గాల్టిన్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 6: ప్రపంచ మేటి అథ్లెట్, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కు కెరీర్‌లో చివరి స్ప్రింట్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి, అమెరికా అథ్లెట్ జస్టిన్ గాల్టిన్ చేతిలో షాక్ తిన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 100 మీటర్ల పరుగు కోసం బోల్ట్ అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురుచూశారో, ఫలితం తారుమారు కావడంతో అంతగా నిరాశ చెందారు. గాల్టిన్ లక్ష్యాన్ని 9.92 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. బోల్ట్ కనీసం రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేక, కాంస్య పతకంతో సంతృప్తి చెందడం ఈ పోటీలను స్టేడియంలో ప్రత్యక్షంగా, టీవీల్లో పరోక్షంగా తలకించిన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాకే చెందిన క్రిస్టియన్ కోల్‌మన్ 9.94 సెకన్లతో రజత పతకాన్ని సాధించాడు. బోల్ట్ అతని కంటే 0.01 సెకన్లు ఆలస్యంగా రేస్‌ను పూర్తి చేసి, కాంస్య పతకం అందుకున్నాడు.
ఉసేన్ బోల్ట్..
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో తొమ్మిది స్వర్ణాలు సాధించి, తిరుగులేని స్ప్రింటర్‌గా ఎదిగిన అసాధారణ అథ్లెట్. పురుషుల 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు అతని పేరుమీదే ఉంది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో పదో స్వర్ణం కోసం అతను ట్రాక్‌పైకి నడుచుకుంటూ వస్తున్నప్పుడు స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది. కొంత మంది అతని పేరు ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తే, మరి కొంత మంది అతని మాదిరిగానే ‘లైట్నింగ్’ ఫోజుతో కేరింతలు కొట్టారు. వామప్ ప్రక్రియ ముగిసి, పోటీదారులంతా పొజిషన్స్ తీసుకోవడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. అందరూ ఎంతో ఊపిరి బిగబట్టి, బోల్ట్ చివరి స్ప్రింట్ రేస్‌ను చూసేందుకు సిద్ధమయ్యారు. రేస్ ఆరంభాన్ని సూచిస్తూ గన్ మోగిన శబ్దం విన్న మరుక్షణమే పోటీదారులంతా వింటి నుంచి బయటపడిన బాణాల్లా లక్ష్యం వైపు దూసుకెళ్లారు. మొదటి 50 మీటర్ల దూరం ముగిసే వరకూ గాల్టిన్, కోల్‌మన్ కంటే బోల్ట్ వెనుక బడినా ఎవరూ అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేదు. చివరిలో, రెట్టించిన వేగంతో అతను మెరుపులా పరిగెత్తి, లక్ష్యాన్ని చేరతాడనే ఊహించారు. కానీ, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ఆ ముగ్గురి మధ్య తేడా చివరి వరకూ అదే రీతిలో కొనసాగింది. కోల్‌మన్ కంటే 0.2 సెకన్లు ముందుగా రేస్‌ను పూర్తి చేసిన గాల్టిన్‌కు స్వర్ణం దక్కింది. కొల్‌మన్ కంటే కేవలం 0.01 సెకన్ల వెనుకబడిన బోల్ట్‌కు కాంస్య పతకం లభించింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో అతనికి ఇది పదో పతకం. వీటిలో తొమ్మిది స్వర్ణాలైతే, ఇదొక్కటే కాంస్యం. ఈసారి 200 మీటర్ల పరుగులో బోల్ట్ పాల్గొనడం లేదు. అయితే, 400 మీటర్ల రిలేలో పోటీపడతా డు. ఆ రేస్‌తో బోల్ట్ అంతర్జాతీయ కెరీర్ ముగుస్తుంది.

చిత్రాలు.. బోల్ట్‌కు షాకిచ్చిన జస్టిన్ గాల్టిన్
*‘నన్ను క్షమించండి. నేను విజయంతో స్ప్రింట్ కెరీర్‌ను ముగించలేకపోయాను. మీరంతా నాకు ఇచ్చిన మద్దతుకు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. ఈ రేస్ ఆద్యంతం నన్ను అలరించింది. తీవ్రమైన పోటీ ఉంటేనే రేస్‌లకు అర్థం ఉంటుంది’
*రేస్ ముగిసిన తర్వాత తనదైన ‘లైట్నింగ్’ ఫోజులిస్తున్న ఉసేన్ బోల్ట్