క్రీడాభూమి

గెలిచింది నేనైనా.. నువ్వే గ్రేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో హాట్ ఫేవరిట్ ఉసేన్ బోల్ట్‌ను ఓడించి జస్టిన్ గాల్టిన్ తన చిరకాల లక్ష్యాన్ని సాధించాడు. అయితే, స్టేడియం యావత్తు బోల్ట్ నామస్మరణ చేయడం గాల్టిన్‌కు అతనికి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో స్పష్టం చేసింది. స్ప్రింట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించడమేగాక, ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్న బోల్ట్ పట్ల గాల్టిన్‌కు కూడా ఎంతో గౌరవం ఉంది. రేస్ ముగిసిన వెంటనే అతను బోల్ట్ వద్దకు వెళ్లి మోకరిల్లాడు. ‘నువ్వే గ్రేట్’ అన్న చందంగా మోకాళ్లపై కూర్చొని అభివాదం చేశాడు. ఈ దృశ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది.