క్రీడాభూమి

చైనా ఓపెన్‌కు షరపోవా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఆగస్టు 7: రష్యా అందాల భామ మరియా షరపోవా బీజింగ్‌లో వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు అంగీకరించింది. టోర్నీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు వైల్డ్‌కార్డుతో ఆడేందుకు ఆమె సిద్ధమవుతోంది. కెరీర్‌లో ఐదు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన షరపోవా తొడ కండరాలకు తగిలిన గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్‌తో పాటు గ్రాస్ కోర్టు సీజన్‌కు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్టాన్‌ఫోర్డ్ ఓపెన్ ఎటిపి టోర్నీలో బరిలోకి దిగినప్పటికీ ఎడమచేతికి తగిలిన గాయం కారణంగా గత వారం ఆ టోర్నీ నుంచి కూడా వైదొలగాల్సి వచ్చింది. డోపింగ్ పరీక్షల్లో విఫలమైనందుకు 15 నెలల పాటు నిషేధానికి గురైన షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ నిషేధాన్ని పూర్తిచేసుకుని మళ్లీ బరిలోకి దిగిన నాటి నుంచి కేవలం నాలుగు టోర్నమెంట్లలో మాత్రమే ఆడింది. అయితే వచ్చే నెల నుంచి చైనా ఓపెన్‌లో ఆడబోతున్నానని అభిమానులకు తెలియజేసేందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని, ఈ ఏడాది ఆసియా ఖండంలో తాను ఆడబోతున్న తొలి టోర్నమెంట్ ఇదేనని షరపోవా (30) ఒక ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరిగే చైనా ఓపెన్ టోర్నమెంట్‌లో షరపోవాతో పాటు వింబుల్డన్ చాంపియన్ గార్బిన్ ముగురుజా, కరోలిన్ వొజ్నియాకీ, అమెరికా ‘నల్లకలువ’ వీనస్ విలియమ్స్, లోకల్ ఫేవరెట్లు జంగ్ షుయి, పెంగ్ షుయి తదితరులు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.