క్రీడాభూమి

జడేజా స్థానంలో అక్షర్ పటేల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సస్పెన్షన్‌కు గురయిన ఆల్‌రౌండర్ అజయ్ జడేజా స్థానాన్ని ఈ నెల 12నుంచి పల్లెకెలెలో శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టులో ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో దక్కించుకున్న నేపథ్యంలో మూడో టెస్టులో అశ్విన్‌కు విశ్రాంతి ఇచ్చి యువ స్పిన్నర్ కుల్దీప్‌ను ఆడించాలని టీమిండియా మేనేజిమెంట్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, జడేజా సస్పెన్షన్ కారణంగా రెండో స్నిన్నర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎడంచేతివాటం సిన్నర్ అక్షర్ పటేల్, లేదా ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌లలో ఒకరికి ఈ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పల్లెకెలెలో ఉన్న సెలెక్షన్ బోర్డు చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్ జట్టు కోచ్ రవిశాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అక్షర్ పటేల్ భారత్ ఏ జట్టు సభ్యుడుగా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నాడు. అయితే అక్కడ వన్‌డే మ్యాచ్‌లు మంగళవారంతో ముగియనున్నందున అక్షర్ పటేల్ పదో తేదీకల్లా జట్టులో చేరడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేరు వెల్లడించని బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు. ఒక వేళ అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసినట్లయితే శ్రీలంక పర్యటనలో హార్దిక్ పాండ్య తర్వాత టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడవుతాడు. అయితే జయంత్ యాదవ్‌కు ఇప్పటికే టెస్టుల్లో ఆడిన అనుభవం ఉన్న దృష్ట్యా అతడ్నికూడా ఎంపిక చేసే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని ఆ అధికారి చెప్పారు.