క్రీడాభూమి

కనెక్టికట్ ఓపెన్‌లో క్విటోవాకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూహెవెన్, ఆగస్టు 22: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాకు న్యూహెవెన్‌లో జరుగుతున్న కనెక్టికట్ ఓపెన్ టోర్నీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెరీర్‌లో రెండుసార్లు ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించడంతో పాటు న్యూహెవెన్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన క్విటోవా మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 2-6, 1-6 సెట్ల తేడాతో చైనా క్రీడాకారిణి షుయి జంగ్ చేతిలో ఓటమిపాలై కనెక్టికట్ ఓపెన్ నుంచి ఆదిలోనే నిష్క్రమించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ గ్రాస్ కోర్టుల్లో 8 మ్యాచ్‌లు ఆడిన క్విటోవాకి ఇది నాలుగో పరాజయం. గత ఏడాది డిసెంబర్‌లో ఒక ఆగంతకుడు క్విటోవా ఇంటిలోకి చొరబడి ఆమెను కత్తితో పొడవడంతో ఎడమ చేతికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న క్విటోవా ఈ ఏడాది మేనెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగి మళ్లీ ఆటను ప్రారంభించింది. కాగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 29వ స్థానంలో కొనసాగుతున్న జంగ్ అమెరికాలో మ్యాచ్ ఆడటం ఏప్రిల్ తర్వాత ఇదే తొలిసారి. ఆమె చేతిలో పరాజయం పాలైన అనంతరం క్విటోవా విలేఖర్లతో మాట్లాడుతూ, చైనా నుంచి గత రాత్రే నేరుగా న్యూహెవెన్‌కు చేరుకున్నానని, ఈ రెండు ప్రాంతాల మధ్య సమయంలో 12 గంటలు వ్యత్యాసం ఉండటంతో మ్యాచ్ ప్రారంభమయ్యే వరకూ నిద్రపోతూనే ఉన్నానని చెప్పింది.
రెండో రౌండ్‌కు బౌచర్డ్
అంతకుముందు మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో కెనడా క్రీడాకారిణి యెవ్‌గెనీ బౌచర్డ్ 6-3, 6-1 సెట్ల తేడాతో ర్యాంకింగ్స్‌లో తనకంటే ఉన్నత స్థానంలో ఉన్న లారెన్ డేవిస్ (అమెరికా)ను మట్టికరిపించింది. వైల్డ్ కార్డుతో ఈ టోర్నీలో ఆడుతున్న బౌచర్డ్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ క్రీడాకారిణి అగ్నేస్కా రద్వాన్‌స్కాతో తలపడనుంది. 2014లో ఐదో స్థానానికి ఎగబాకి కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించిన బౌచర్డ్ గత కొంత కాలం నుంచి సరిగా రాణించలేకపోతోంది. దీంతో ప్రస్తుతం ఆమె 74వ ర్యాంకుకు దిగజారింది. కాగా, మహిళల సింగిల్స్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) 6-2, 6-3 తేడాతో లెసియా సురెంకో (ఉక్రెయిన్)ను చిత్తు చేయగా, అనా బోగ్డన్ (రొమేనియా) 7-5, 7-5 తేడాతో ఎలెనా వెస్నినా (రష్యా)పై విజయం సాధించింది.