క్రీడాభూమి

ప్రీ-క్వార్టర్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, ఆగస్టు 22: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో ‘తెలుగు తేజం’ పివి.సింధు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన సింధు మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యో మిన్‌ను వరుస గేముల తేడాతో మట్టికరిపించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండుసార్లు (2013, 2014 ఎడిషన్లలో) కాంస్య పతకాలు సాధించిన సింధు 21-16, 21-14 గేముల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి కేవలం 49 నిమిషాల్లోనే విజయం సాధించింది. కిమ్‌పై ఇప్పటివరకూ ఐదుసార్లు తలపడిన సింధుకి ఇది నాలుగో విజయం. తొలి రౌండ్‌లో బై సాధించిన సింధు (22) ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ బెర్తు కోసం రష్యా క్రీడాకారిణి యెవ్‌గెనీ కొసెట్‌స్కయెవాతో గానీ, హాంకాంగ్‌కు చెందిన 13వ సీడ్ క్రీడాకారిణి చెయుంగ్ గన్ యితో గానీ తలపడాల్సి ఉంటుంది.
సాయి ప్రణీత్ బోణీ
పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ఆటగాడు బి.సాయి ప్రణీత్ కూడా శుభారంభాన్ని సాధించాడు. 15వ సీడ్‌గా బరిలోకి దిగిన అతను 48 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగిన తొలి రౌండ్ పోరులో 21-18, 21-18 హాంకాంగ్‌కు చెందిన వెయి నాన్‌ను మట్టికరిపించాడు. రెండో రౌండ్‌లో ప్రణీత్ (25) ఇండోనేషియాకి చెందిన ఆంథోనీ సినిసుకా గింటింగ్‌తో తలపడనున్నాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో
ప్రణవ్-సిక్కీ పురోగమనం
కాగా, ఈ ఏడాది సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత టాప్ జోడీ ప్రణవ్ జెర్రీ-ఎన్.సిక్కీ రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్ ముందడుగు వేశారు. ఈ టోర్నమెంట్‌లో 15వ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు 21-12, 21-19 గేముల తేడాతో ప్రజక్తా సావంత్ (్భరత్), యోగేంద్రన్ కృష్ణన్ (మలేషియా) జోడీని మట్టికరిపించారు. అయితే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగిన ఇతర మ్యాచ్‌లలో బి.సుమీత్ రెడ్డి-అశ్వనీ పొన్నప్ప, రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్-కె.మనీషా తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలవడం భారత శిబిరాన్ని అసంతృప్తికి గురిచేసింది. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టోర్నీలో ఫైనల్స్‌కు చేరుకున్న సుమీత్-అశ్వనీ 17-21, 21-18, 5-21 తేడాతో చైనాకి 13వ సీడ్ జోడీ వాంగ్ ఇల్యు-హువాంగ్ డోంగ్‌పింగ్ చేతిలో ఓటమిపాలవగా, సాత్విక్ సాయిరాజ్-మనీషా 20-22, 18-21 తేడాతో డెన్మార్క్‌కు చెందిన 14వ సీడ్ జోడీ మథియాస్ క్రిస్టియనె్సన్-సరా థిగెసెన్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు.