క్రీడాభూమి

‘అర్జున’ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రభుత్వం ప్రతి సంవత్సరం అర్జున అవార్డులు ప్రకటించడం ద్వారా ఆ అవార్డు గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చుతోందని, గతంలో అర్జున అవార్డును అందుకున్న పలువురు మాజీ క్రీడాకారులు అభిప్రాయ పడ్డారు. ధ్యాన్‌చంద్ కుమారుడు, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అశోక్ కుమార్, 1976నుంచి 800 మీటర్ల పరుగుపందెంలో జాతీయ రికార్డును నిలబెట్టుకున్న శ్రీరాం సింగ్ షెకావత్, జాతీయ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ సురేశ్ మిశ్రా అందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అవార్డుకున్న ప్రతిష్ఠను కాపాడాలి. ప్రతి సంవత్సరం ఎందుకు అర్జున అవార్డులు ప్రకటించాలి? ఇది అవసరమా? ఇప్పుడు మనం అవార్డులను ఇష్టం వచ్చినట్లు ఇచ్చేస్తున్నాం’ అని అశోక్ కుమార్ పిటిఐతో అన్నాడు. ప్రభుత్వం కొన్ని కొలమానాలను నిర్ణయించుకోవాలి. అవార్డు ఇస్తే దానికున్న విలువ ఇనుమడించాలి. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారినే అర్జున అవార్డుల కోసం ఎంపిక చేయాలనే కొలమానం ఉండాలని 1975లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టు సభ్యుడయిన అశోక్ కుమార్ అన్నాడు.
అథ్లెట్లు అవార్డు కోసం తన పేరును పరిశీలించడం కోసం దరఖాస్తులు పంపుకొనే ప్రస్తుత విధానాన్ని 1974లో అర్జున అవార్డుగ్రహీత అయిన అశోక్ తప్పుబట్టాడు. ‘అవార్డు కోసం అడుక్కోవడం, లేదా డిమాండ్ చేయడం ఉండకూడదు. నేను ఏదో సాధించానంటూ సొంత డబ్బా ఎందుకు కొట్టుకోవాలి? ఎవరైనా పోటీకి వెళ్లారంటే ప్రభుత్వం అనుమతిస్తేనే వెళ్తారు. మనం ఏం సాధించామో వాళ్లకు తెలుసు. అందువల్ల అథ్లెట్లు దరఖాస్తులు పండడం కన్నా ప్రభుత్వమే అవార్డు కోసం అథ్లెట్లను ఎంపిక చేస్తే బాగుంటుందని అశోక్ అభిప్రాయ పడ్డాడు. ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగా అవార్డుల కమిటీ ఎంపిక చేస్తే బాగుంటుందని ఆయన అంటూ, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం అంటే గ్రాంటు అడగడమేనని అన్నారు. అర్హులు కాని వారికి అవార్డుల కోసం ఎంపిక చేస్తున్నారని భావిస్తున్నారా అని అడగ్గా, తాను ఎవరి గురించీ మాట్లాడడం లేదని, వ్యవస్థలో లోపాలగురించే మాట్లాడుతున్నానన్నాడు.
కాగా, తన హయాంలో అర్జున అవార్డు కోసం పోటీ ఎంత గట్టిగా ఉండేదో 1974 టెహరాన్ ఆసియా గేమ్స్‌లో బంగారు, 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో రజత పతకాలు సాధించిన షెకావత్ వివరించాడు. 1972 సంవత్సరానికి అర్జున అవార్డును నిర్ణయించిన సమయంలో తాను ఆసియా పతకం సాధించి ఉన్నప్పటికీ తనకు అవార్డు లభించలేదని ఆయన చెప్పాడు. తమ కేటగిరీలో అవార్డుకు ఒకరినే ఎంపిక చేయాల్సి ఉండగా విఎస్ చౌహాన్‌కు ఇచ్చారని చెప్పాడు. ఇద్దరమూ జాతీయ రికార్డు సృష్టించిన వాళ్లమే అయినా చౌహాన్ తనకన్నా సీనియర్ అయినందున ఆయననే ఎంపిక చేశారని చెప్పాడు. ఆ మరుసటి సంవత్సరం షెకావత్‌కు అర్జున అవార్డు దక్కింది. అర్జున అవార్డుకోసం ఎంపికయ్యే అథ్లెట్లు కనీసం ఆసియా క్రీడల స్థాయిలో పతకం సాధించిన వాళ్లయి ఉండాలని ఆయన అన్నాడు. కేవలం అర్జున అవార్డు ఒక్కటే ఉండాలని, దేశ అత్యున్నత పురస్కారంగా రాజీవ్ ఖేల్త్న్ర అవార్డును చేయడం సరికాదని సురేశ్ మిశ్రా అభిప్రాయ పడ్డాడు. ఇది అర్జున అవార్డుకే అవమానమని ఆయన అన్నాడు. కాగా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ మాత్రం అవార్డులు ఇవ్వడం ఒక విధంగా అథ్లెట్లను ప్రోత్సహించడమని అభిప్రాయ పడ్డాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో సాధించే విజయాలను అవార్డు కోసం పరిగణనలోకి తీసుకోకూడదని మరో మాజీ హాకీ క్రీడాకారుడు ఎంపి సింగ్ సూచించారు.