క్రీడాభూమి

షరపోవా బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 29: డోపింగ్ వ్యవహారంలో 15 నెలల పాటు నిషేధాన్ని పూర్తి చేసుకుని మళ్లీ ర్యాకెట్ చేతబట్టిన రష్యా అందాల భామ మరియా షరపోవా (30) యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభాన్ని సాధించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ఆమె 6-4, 4-6, 6-3 తేడాతో రుమేనియాకి చెందిన ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సిమోనా హాలెప్ (25)ను మట్టికరిపించి తన సత్తా చాటుకుంది. తద్వారా ఆమె గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తన పునరాగమనాన్ని విజయంతో మొదలు పెట్టింది. ముంజేతి గాయం కారణంగా యుఎస్ ఓపెన్‌కు ముందు హార్డ్ కోర్టులో ఒకే ఒక్క సన్నాహక మ్యాచ్ ఆడిన షరపోవా న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ రౌండ్‌లో విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చింది. ఈ మ్యాచ్‌లో షరపోవా 64 అనవసర తప్పిదాలకు పాల్పడినప్పటికీ 60 విన్నర్లతో హాలెప్‌ను ఓడించి తనలో ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం షరపోవా మాట్లాడుతూ, ఎప్పటి మాదిరిగానే ఈ మ్యాచ్‌నూ సాధారమణమైనదిగా, మరో అవకాశంగా భావించా. కానీ నేను అనుకున్న దానికంటే ఇది చాలా ఎక్కువే. ఒక్కోసారి మనం పూర్తిస్థాయిలో ఎందుకు శ్రమించామా అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అలా చేయాల్సిన అవసరమేమిటో ఈ మ్యాచ్‌ను చూస్తే అవగతమవుతుంది’ అని స్పష్టం చేసింది. కెరీర్‌లో ఐదు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన షరపోవా గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ సందర్భంగా మెల్డోనియం అనే ఉత్ప్రేరకాన్ని వాడినందుకు 15 నెలల పాటు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. అయితే తాజా విజయంతో ఆమె ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ తన చిరకాల ప్రత్యర్థి హాలెప్‌ను ఓడించినట్లయింది. ఈ మ్యాచ్‌లో చివరి పాయింట్ సాధించిన తర్వాత తీవ్ర భావోద్వేద్వేగానికి గురై కోర్టులో మోకరిల్లిన షరపోవా అంతలోనే పైకి లేచి అంపైర్‌కు ధన్యవాదాలు తెలిపింది. కళ్ల నుంచి ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.
కోంటా ఔట్
ఇదిలావుంటే, ఈ టోర్నీలో సెర్బియాకి చెందిన 78వ సీడ్ క్రీడాకారిణి అలెక్సాండ్రా క్రునిక్ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆమె 4-6, 6-3, 6-4 సెట్ల తేడాతో బ్రిటన్‌కు చెందిన ఏడో సీడ్ క్రీడాకారిణి జొహన్నా కోంటాను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. అలాగే ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ సాధించిన గార్బిన్ ముగురుజా (స్పెయిన్), ఏడు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన వీనస్ విలియమ్స్, పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ ఆటగాడు మారిన్ సిలిక్ కూడా తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించారు. 2014లో యుఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఐదో సీడ్ మారిన్ సిలిక్ 6-4, 6-3, 3-6. 6-3 తేడాతో 105వ ర్యాంకు ఆటగాడు టెన్నీస్ శాండ్‌గ్రెన్ (అమెరికా)ను ఓడించగా, ముగురుజా 6-0, 6-3 తేడాతో వర్వరా లెప్చెంకోపై, వీనస్ విలియమ్స్ 6-3, 3-6, 6-2 తేడాతో 135వ ర్యాంకు క్రీడాకారిణి విక్టర్ కుజ్మోవా (స్లొవేకియా)పై విజయం సాధించారు.