క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన జఝరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న తొలి పారా అథ్లెట్‌గా దేవేంద్ర జఝరియా చరిత్ర సృష్టించాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో మంగళవారం కన్నుల పండువగా జరిగిన కార్యక్రమంలో అతను హాకీస్టార్ సర్దార్ సింగ్‌తో కలసి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు క్రీడా పురస్కారాలను అందుకున్నారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచే విధంగా పతక విజేతలను తయారు చేసిన శిక్షకులకు లేదా గురువులకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును జీఎస్‌ఎస్‌వి.ప్రసాద్ (బ్యాడ్మింటన్) అందుకున్నారు. జాతీయ క్రీడల్లో మంచి ప్రతిభ కనబర్చిన క్రీడకాలకు ఇచ్చే అర్జున పురస్కారాలను వెన్నం జ్యోతి సురేఖ (విలు విద్య), సాకేత్ మైనేని (టెన్నిస్) అవార్డులను అందుకోగా, క్రీడారంగానికి విశేష సేవలందించిన వారికి ఇచ్చే అలాగే క్రీడల్లో మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సయ్యద్ షాహిద్ హకిమ్ (్ఫడ్‌బాల్) అందుకున్నారు.

చిత్రాలు.. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకుంటున్న దేవేంద్ర జఝరియా, సర్దార్ సింగ్, అర్జున అవార్డును అందుకొంటున్న వెన్నం జ్యోతి సురేఖ