క్రీడాభూమి

షపోవలోవ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 2: యుఎస్ ఓపెన్‌లో మైఖేల్ చాంగ్ (1989) తర్వాత ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా కెనడా యువ ఆటగాడు డెనిస్ షపోవలోవ్ రికార్డు సృష్టించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో షపోవలోవ్‌తో తలపడిన కైల్ ఎడ్మండ్ (బ్రిటన్) మెడ గాయం కారణంగా రిటైర్ అయ్యాడు. అప్పటికి షపోవలోవ్ 3-6, 6-2, 6-3, 1-0 ఆధిక్యతలో కొనసాగుతుండటంతో అతడిని విజేతగా ప్రకటించారు. ఇజ్రాయిల్‌లో పుట్టిన షపోవలోవ్ (18) ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 69వ స్థానంలో కొనసాగుతున్నాడు. క్వార్టర్ ఫైనల్ బెర్తు కోసం షపోవలోవ్ స్పెయిన్‌కి చెందిన 12వ సీడ్ ఆటగాడు పాబ్లో కరెనో బస్టాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మూడో రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో పాబ్లో కరెనో 6-3, 6-4, 6-3 తేడాతో ఫ్రెంచి క్వాలిఫయర్ నికోలస్ మహుట్‌పై విజయం సాధించాడు.

చిత్రం..డెనిస్ షపోవలోవ్ (కెనడా)