క్రీడాభూమి

టార్గెట్.. క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 2: శ్రీలంకపై టెస్టుల మాదిరిగానే వన్‌డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌తో ముగించాలని కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. శ్రీలంక, భారత జట్ల మధ్య అయిదు మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే నాలుగు వన్‌డేలలోను విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌తో ముగించాలని ఉవ్విళ్లూరుతుండగా, కనీసం చివరి వన్‌డేనైనా గెలుచుకొని పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక అనుకొంటోంది. కాగా, శ్రీలంక వరసగా రెండోసారి భారత్ చేతిలో వన్‌డే సిరీస్‌ను 5-0 తేడాతో కోల్పోయే ప్రమాదంలో ఉంది. 2014 నవంబర్‌లో ఈ రెండు జట్లూ ద్వైపాక్షిక సిరీస్ ఆడినప్పుడు శ్రీలంక జట్టు 5-0 తేడాతో వన్‌డే సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో జరిగిన ఆ సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు చివరి వన్‌డేలో కూడా భారత్ గెలిచినట్లయితే రెండు సార్లు వరసగా వన్‌డే సిరీస్‌లో వైట్‌వాష్ అవమానాన్ని ఎదుర్కొంటుంది. ఈ సిరీస్‌లో గనుక రెండు మ్యాచ్‌లను గెలుచుకొని ఉంటే శ్రీలంక జట్టు 2019లో జరిగే వన్‌డే ప్రపంచ కప్‌కు ఆటోమేటిగ్గా క్వాలిఫై అయి ఉండేది. అయితే నాలుగు మ్యాచ్‌లను వరసగా కోల్పోవడంతో ఆ అవకాశం కూడా చేజార్చుకుంది.
కాగా, చివరి వన్‌డేలోను నెగ్గితే కోహ్లీ సేన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొనే సువర్ణావకాశం దక్కనుంది. ఈ దశాబ్దంలో వరసగా రెండు జట్లపై క్లీన్‌స్వీప్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. గత పదేళ్లలో ఇంగ్లాండ్ జట్టు ఒక్కటే భారత్ చేతిలో 5-0 తేడాతో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది. 2008-09 సీజన్‌లో ఇంగ్లండ్‌ను తొలిసారిగా వైట్‌వాష్ చేసిన భారత్ తిరిగి 2012-13 సీజన్‌లోను క్లీన్‌స్వీప్ చేసింది. కాగా, 2014-15 సిరీస్‌లో 1లంకపై 5-0 తేడాతో విజయం సాధించిన భారత్‌కు రేపటి వన్‌డే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆ అరుదైన ఘనతను దక్కించుకుంటుంది.
ఇప్పటికే వరసగా నాలుగు వన్‌డేలలో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన అయిదో వన్‌డేలోను విజయం సాధించి ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని అనుకొంటోంది. ఈ నేపథ్యంలో జట్టులో ఏవయినా మార్పులు చేస్తారా, లేక నాలుగో వన్‌డేలో ఆడిన జట్టునే కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. నాలుగో వన్‌డేలో ఆడిన జట్టునే కొనసాగించినట్లయితే మనీష్ పాండే, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకుర్‌లకు మరో అవకాశం లనించినట్లవుతుంది. అయితే సొంతగడ్డపై రానున్న సుదీర్ఘ వన్‌డే షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని బౌలర్‌గా కేదార్ జాదవ్‌కు ఒక అవకాశమివ్వాలనుకుంటే హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వొచ్చు. అలాగే ఇప్పటివరకు అవకాశం లభించని ఓపెనర్ అజింక్య రహానేకు చివరి మ్యాచ్‌లోనైనా ఆడే అవకాశం లభిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. అయితే రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం, శిఖర్ ధావన్ కూడా చక్కగా రాణిస్తూ ఉండడంతో టీమ్ మేనేజిమెంట్ ప్రయోగాల జోలికి వెళ్లాలనుకోలేదు. అయితే మిడిలార్డర్ ప్రయోగంలో కెఎల్ రాహుల్ విఫలమయిన నేపథ్యంలో రహానేకు అవకాశం ఇచ్చే చాన్స్ లేకపోలేదు.
ఇక రెండు మ్యాచ్‌ల నిషేధం తర్వాత శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ తిరిగి జట్టులోకి వస్తుండడంతో ఆ జట్టు కనీసం చివరి మ్యాచ్‌నయినా గెలుచుకొని పరువు నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో లాహిరు తిరుమానేను మరోసారి ఓపెనర్‌గా ఆడించే అవకాశం కనిపిస్తోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.