క్రీడాభూమి

ప్రీ-క్వార్టర్స్‌కు నాదల్, ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అయితే మహిళా అంపైర్‌పై నోరు పారేసుకున్న వివాదాస్పద ఆటగాడు ఫాబియో ఫోగ్నినీ (ఇటలీ)ని ఈ టోర్నీ నుంచి బయటికి గెంటేశారు. 31 ఏళ్ల నాదల్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో విజయం కోసం మరోసారి శ్రమించాల్సి వచ్చింది. అర్జెంటీనా ఆటగాడు లియోనార్డో మేయర్‌తో జరిగిన ఈ పోరులో తొలి సెట్‌ను 7-6 తేడాతో చేజార్చుకున్న నాదల్ ఆ తర్వాత తనదైన శైలిలో విజృంభించి ఆడాడు. ఫలితంగా 3-6, 1-6, 4-6 తేడాతో వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకున్న నాదల్ మరోసారి లియోనార్డోపై తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. దీంతో లియోనార్డోపై ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ నాదల్ విజయం సాధించినట్లయింది. క్వార్టర్ ఫైనల్ బెర్తు కోసం నాదల్ ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ డోల్గొపొలోవ్‌తో తలపడనున్నాడు. డోల్గొపొలోవ్‌పై ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లలో తలపడిన నాదల్ ఆరు విజయాలను నమోదు చేసుకుని రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలయ్యాడు.
కాగా, యుఎస్ ఓపెన్‌లో ఐదుసార్లు టైటిళ్లను కైవసం చేసుకున్న ఫెదరర్ మూడో రౌండ్ పోరులో 6-3, 6-3, 7-5 తేడాతో స్పెయిన్‌కు చెందిన 31వ సీడ్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్‌ను మట్టికరిపించాడు. దీంతో ఫెదరర్ ఇప్పటివరకూ లోపెజ్‌తో ఆడిన మొత్తం 13 మ్యాచ్‌లలోనూ విజయం సాధించినట్లయింది. క్వార్టర్ ఫైనల్‌లో స్థానం కోసం ఫెదరర్ జర్మనీకి చెందిన 33వ సీడ్ ఆటగాడు ఫిలిప్ ఖోల్‌ష్క్రిబర్‌తో తలపడనున్నాడు. ఖోల్‌ష్క్రిబర్‌తో ఇప్పటివరకూ 11 సార్లు తలపడిన ఫెదరర్ అన్ని మ్యాచ్‌లలోనూ విజయభేరి మోగించాడు. మూడో రౌండ్‌లో ఖోల్‌ష్క్రిబర్ 7-5, 6-2, 6-4 తేడాతో జాన్ మిల్‌మన్ (ఆస్ట్రేలియా)ను మట్టికరిపించగా, ఆరో సీడ్ ఆటగాడు డొమినిక్ థియెమ్ (ఆస్ట్రేలియా), జువాన్ మార్టిన్ డెల్‌పోట్రో (అర్జెంటీనా), రష్యా యువ ఆటగాడు ఆండ్రూ రబ్లెవ్, తొమ్మిదో సీడ్ ఆటగాడు డేవిడ్ గోఫిన్ (బెల్జియం) కూడా ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించారు. మూడో రౌండ్‌లో థియెమ్ 7-5, 6-3, 6-4 తేడాతో అడ్రియన్ మన్నారినో (ఫ్రాన్స్)ను ఓడించగా, డెల్‌పోట్రో 6-3, 6-3, 6-4 తేడాతో రాబెర్డో బటిస్టా అగట్ (స్పెయిన్)పై, రబ్లెవ్ 6-4, 6-4, 5-7, 6-4 తేడాతో దమిర్ జుమ్హర్ (బోస్నియా)పై విజయం సాధించారు. కాగా, ఫ్రాన్స్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ మోకాలి గాయం కారణంగా మూడో రౌండ్ మ్యాచ్ నుంచి రిటైర్ కావడంతో అతని ప్రత్యర్థి డేవిడ్ గోఫిన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
మ్యాచ్ పాయింట్‌ను
కాపాడుకున్న ప్లిస్కోవా
కాగా, మహిళల సింగిల్స్ విభాగంలో టాప్‌సీడ్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాతో పాటు ఉక్రెయిన్‌కు చెందిన నాలుగో సీడ్ క్రీడాకారిణి ఎలినా స్వెతోలినా, దరియా కసాత్కినా (రష్యా) ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మూడో రౌండ్‌లో ప్లిస్కోవా 3-6, 7-5, 6-4 తేడాతో చైనా క్రీడాకారిణి జంగ్ షుయిని ఓడించింది. ఈ క్రమంలో ప్లిస్కోవా రెండో సెట్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోవడం ద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానానికి ముప్పు వాటిల్లకుండా చూసుకుంది. అలాగే మూడో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో స్వెతోలినా 6-4, 7-5 తేడాతో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై విజయం సాధించగా, కసాత్కినా 6-3, 6-2 తేడాతో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకోకి షాకిచ్చింది.

చిత్రం..‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్