క్రీడాభూమి

తొలి రౌండ్‌లోనే దీపిక ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, సెప్టెంబర్ 3: ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పోరాటం అత్యంత పేలవంగా ముగిసింది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకాన్ని తెచ్చిపెడుతుందని ఆశించిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి ఆదివారం ఇక్కడ తైవాన్‌కు చెందిన టాన్ యా టింగ్ చేతిలో వరుస సెట్ల తేడాతో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ కప్ ఫైనల్‌లో నాలుగుసార్లు రజత పతకాలు సాధించిన దీపికా కుమారి ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. గత ఏడాది రియో ఒలింపిక్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో దీపికను ఓడించిన టాన్ యా టింగ్ తాజాగా రోమ్‌లోని స్టేడియో డీ మార్మిలో జరిగిన ఈ పోరులో మరోసారి అద్భుత ప్రదర్శనతో రాణించి 6-0 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ కప్ ఫైనల్ డ్రాలో తలపడుతున్న ఎనిమిది మంది ఆర్చర్లలో భారత్ నుంచి దీపికా కుమారికి మాత్రమే అర్హత లభించింది. ఈ ఏడాది జరిగిన నాలుగు ప్రపంచ కప్ టోర్నీల్లో రెండింట దీపిక క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది. అయితే తొలి సెట్‌లోనే టాన్ యా టింగ్ రెండుసార్లు 10 చొప్పున (10-9-10) పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తగా, దీపిక వరుసగా 8-9-10 పాయింట్లతో సరిపుచ్చుకుంది. ఆ తర్వాత రెండో సెట్‌లో టాన్ యా టింగ్ 30కి 30 పాయింట్లు సాధించి మరోసారి సంచలనం సృష్టించగా, 25 పాయింట్లకే పరిమితమైన దీపిక ప్రత్యర్థికి ఏమాత్రం జవాబివ్వలేకపోయింది. దీంతో మూడో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించిన టాన్ యాటింగ్ 28 పాయింట్లు రాబట్టుకుంది. తద్వారా ఈ ఈవెంట్‌లో ఐదోసారి ఫైనల్‌కు చేరుకోవాలన్న దీపిక ఆశలను పూర్తిగా దెబ్బతీసింది.