క్రీడాభూమి

భారత లిఫ్టర్ల మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామనె్వల్త్ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో మంగళవారం భారత లిఫ్టర్లు మీరాబాయి చానూ, కె.సంజిత పసిడి పతకాలతో మెరుపులు మెరిపించారు. దీంతో వీరిద్దరూ వచ్చే ఏడాది జరిగే కామనె్వల్త్ క్రీడలకు అర్హత సాధించారు. మహిళల 48 కిలోల విభాగంలో మీరాబాయి మొత్తం 189 కిలోల (స్నాచ్‌లో 85 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 104 కిలోలు) బరువులు ఎత్తి పోడియంపై అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం స్నాచ్‌లో 85 కిలోల బరువు ఎత్తిన ఆమె కామనె్వల్త్ క్రీడల్లో ఇంతకుముందు 84 కిలోల బరవు ఎత్తి నెలకొల్పిన సొంత రికార్డును అధిగమించింది. కాగా, మహిళల 53 కిలోల విభాగంలో మొత్తం 195 కిలోల (స్నాచ్‌లో 85 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 110 కిలోలు) బరువులు ఎత్తిన సంజిత కూడా పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, ఈ విభాగంలో భారత్‌కే చెందిన మరో లిఫ్టర్ ఎం.సంతోషి మొత్తం 194 కిలోల (స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 108 కిలోలు) బరువులు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచింది.
అలాగే పురుషుల 56 కిలోల విభాగంలో గురురాజా మొత్తం 246 కిలోల (107+139 కిలోలు) బరువులు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకోగా, జూనియర్ల విభాగాల్లో అనన్యా పాటిల్, జెరేమీ లాల్‌రిన్నుంగ భారత్‌కు రెండు పసిడి పతకాలను అందించారు. యూత్ అండ్ జూనియర్ మహిళల 53 కిలోల విభాగంలో అనన్య మొత్తం 146 కిలోల (66+80 కిలోలు) బరువులు ఎత్తగా, జూనియర్ పురుషుల 56 కిలోల విభాగంలో జెరేమీ మొత్తం 240 (109+131) కేజీల బరువులు ఎత్తి సత్తా చాటుకున్నాడు. అదేవిధంగా జూనియర్ మహిళల 48 కిలోల విభాగంలో 154 (67+87) కిలోల బరువులు ఎత్ని ఝిల్లీ దలాబెహెరా, యూత్ అండ్ జూనియర్ మహిళల 48 కిలోల విభాగంలో 138 (60+78) కిలోల బరువులు ఎత్తిన సెహా సోరెన్ కూడా పసిడి పతకాలను కైవసం చేసుకోగా, బాలుర 56 కిలోల విభాగంలో జఖుమా 215 (95+120) కిలోల బరువులు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

చిత్రం..సొంత రికార్డును తిరగరాసిన మీరాబాయ చానూ