క్రీడాభూమి

టార్గెట్.. సూపర్ సిరీస్ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 5: మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ పుల్లెల గోపీచంద్‌తో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్న సైనా నెహ్వాల్ ఇప్పుడు దుబాయిలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్‌కు క్వాలిఫై కావడమే తన ప్రథమ లక్ష్యమని చెప్పింది. మూడేళ్ల క్రితం గోపీచంద్ అకాడమీకి దూరమై బెంగళూరులో విమల్ కుమార్ అకాడమీలో శిక్షణ పొందుతూ వచ్చిన సైనా తాను తిరిగి గోపీచంద్‌తో జట్టు కట్టనున్నట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారంనుంచి హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ ప్రారంభించనున్నట్లు సైనా చెప్పింది. ‘ఇప్పుడు మేము మా పాత విభేదాలన్నిటినీ మరిచిపోయి ట్రైనింగ్ కొనసాగించడంపైనే దృష్టిపెట్టాం’ అని గతంలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యపతక విజేత అయిన సైనా చెప్పింది. ‘ముందుగా ట్రైనింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాను. గెలవడానికి అవసరమైన పట్టుదల ఉంది. నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తా. ఈ ఏడాది జరిగే దుబాయి సూపర్ సిరీస్‌కు క్వాలిఫై కావడంపైనే నా దృష్టి అంతా ఉంది’ అని సైనా పిటిఐకి చెప్పింది. కాగా, సోమవారంనుంచి హైదరాబాద్‌లో తాను ఆడడం మొదలు పెట్టానని, అయితే కాలు కాస్త నొప్పిగా ఉండడం వల్ల ఈ నెల 7నుంచి పూర్తిస్థాయి ట్రైనింగ్ మొదలుపెడతానని ఆమె చెప్పింది. బెంగళూరులోవిమల్ కుమార్‌తో శిక్షణ పొందేటప్పుడు హోమ్ సిక్ ఫీలవుతూ ఉండే వారా అని అడగ్గా, అలాంటిదేమీ లేదని, అయితే హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఇక్కడికన్నా ఎక్కువ సౌకర్యంగా ఉంటుందని సైనా చెప్పింది. కాగా, తన కోచ్ విమల్ కుమార్‌ను ఆమె ప్రశంసించింది.
కాగా సైనా నెహ్వాల్‌తో కలిసి పని చేయడం మిస్ అవుతున్నానని విమల్ కుమార్ అంటూ, అయితే అంతర్జాతీయ కెరీర్‌లో ఆమె రాణించేదుకు మద్దతు ఇవ్వడమే తనకు ముఖ్యమని అన్నాడు. సోమవారం తాను గోపీతో మాట్లాడడానని ఆయన చెప్పాడు. సైనా తన ట్రైనింగ్‌బేస్‌ను బెంగళూరునుంచి హైదరాబాద్‌కు మార్చుకోవడంపై మీ ఇద్దరూ చర్చించుకున్నారా అని ఆయన తనను అడిగాడని, దీనిపై తమ ఇద్దరి మద్య చక్కటి అవగాహన ఉందని విమల్ కుమార్ పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.