క్రీడాభూమి

ఇక మిగిలింది సానియా మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు రోహన్ బొపన్న పోరాటం పూర్తిగా ముగిసింది. ఈ టోర్నీలో ఏడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన బొపన్న, అతని భాగస్వామి గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా) మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మూడో సీడ్ జంట హావో చింగ్ చాన్, మైఖేల్ వీనస్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతలుగా నిలిచిన బొపన్న, దబ్రోవ్‌స్కీ ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడి 6-4 తేడాతో తొలి సెట్‌ను గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థుల ముందు ఏమాత్రం నిలబడలేకపోయారు. ఫలితంగా 3-6, 8-10 తేడాతో వరుసగా రెండు సెట్లను చేజార్చుకున్న బొపన్న, దబ్రోవ్‌స్కీ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల డబుల్స్ విభాగంలో బొపన్న, పాబ్లో కువాస్ జోడీ ఇప్పటికే ఓటమిపాలవగా, భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, పురవ్ రాజా కూడా రెండో రౌండ్‌లోనే చేతులెత్తేసిన విషయం విదితమే. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ ప్రస్తుతం జేమీ ముర్రేతో జతకట్టడంతో లియాండర్ పేస్ ఏడాది మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీకి దిగలేదు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన హింగిస్, జేమీ ముర్రే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి ఇవాన్ డోడిగ్ రెండో రౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. అయితే మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. చైనా క్రీడకారిణి షుయి పెంగ్‌తో కలసి ఆడుతున్న సానియా మీర్జా ఈ విభాగంలో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
చేతులెత్తేసిన జూనియర్లు
ఇదిలావుంటే, యుఎస్ ఓపెన్ జూనియర్ల విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. బాలికల విభాగంలో మహెక్ జైన్ 3-6, 7-6(5), 1-6 తేడాతో ఆరో సీడ్ జిన్ యు వాంగ్ (చైనా) చేతిలోనూ, మిహికా యాదవ్ 4-6, 6-4, 1-6 తేడాతో నిక్కీ రెదెల్జిక్ (అమెరికా) చేతిలోనూ, జీల్ దేశాయ్ 4-6, 7-6, 3-6 తేడాతో మరియా కమిలా ఒసోరియో సెర్రానో (కొలంబియా) చేతిలోనూ ఓటమిపాలవగా, బాలుర సింగిల్స్ విభాగంలో సిద్ధాంత్ బాంతియా 1-6, 2-6 తేడాతో డానీ థామస్ (అమెరికా) చేతిలోనూ, బాలుర డబుల్స్ విభాగంలో సిద్ధాంత్ బాతియా, అతని భాగస్వామి షింజీ హజవా (జపాన్) 6-3, 3-6, 9-11 తేడాతో లూకాస్ గ్రెయిఫ్, గోవింద్ నందా జోడీ చేతిలోనూ పరాజయాలను ఎదుర్కొన్నారు.