క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన కనేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న రెండవ క్వాలిఫయర్‌గా ఎస్తోనియా క్రీడాకారిణి కైయా కనేపీ చరిత్ర సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 418వ స్థానంలో కొనసాగుతున్న కనేపీ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 6-4 వరుస సెట్ల తేడాతో రష్యాకి చెందిన దరియా కసాత్కినాను మట్టికరిపించింది. గాయాలతో పాటు అనారోగ్య సమస్యలతో కెరీర్ చరమాంకంలో ఉన్న కనేపీ (32) మేజర్ టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి కాగా, యుఎస్ ఓపెన్‌లో రెండోసారి. ప్రపంచంలోని టాప్-10 క్రీడాకారిణుల జాబితాలో ఎన్నడూ చోటు సంపాదించలేకపోయినప్పటికీ గతంలో 15వ ర్యాంకుకు చేరుకున్న కనేపీ సెమీ ఫైనల్ బెర్తు కోసం అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్‌తో తలపడనుంది.
మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో మాడిసన్ కీస్ 7-6(7/2), 1-6, 6-4 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన నాలుగో సీడ్ క్రీడాకారిణి ఎలినా స్వెతోలినాను కంగు తనిపించింది. దీంతో ప్రపంచ అగ్రస్థానానికి చేరుకోవాలన్న స్వెతోలినా ఆశలు నీరుగారిపోయాయి. కాగా, టాప్ సీడ్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాతో పాటు 20వ సీడ్ క్రీడాకారిణి కోకో వాండ్వెఘే కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. పూర్తి ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో ప్లిస్కోవా 6-1, 6-0 జెన్నీఫర్ బ్రాడీ (అమెరికా)ని మట్టికరిపించి ఈ ఏడాది మూడోసారి గ్రాండ్ శ్లామ్ క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించగా, వాండ్వెఘే 6-4, 7-6(7/2) తేడాతో లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

చిత్రాలు..కనేపీ (ఎస్తోనియా)*మాడిసన్ కీస్