క్రీడాభూమి

అంతిమ విజయం కోసం కోహ్లీ సేన ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 5: శ్రీలంక పర్యటనలో ఇప్పటికే టెస్టు, వన్‌డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన బుధవారం జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌లో కూడా ఘన విజయం సాధించి అప్రతిహతంగా పర్యటనను ముగించాలని కోహ్లీ సేన అనుకొంటోంది. బుధవారం నాటి మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయాన్ని తప్ప మరో ఫలితాన్ని ఎవరూ ఊహించరేమో కూడా. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన టెస్టు, వన్‌డే సిరీస్‌లలో లంకేయులను వైట్‌వాష్ చేసిన నేపథ్యంలో బుధవారం మ్యాచ్‌లో సైతం అదే ఫలితం రాక మరేమొస్తుంది?అనేది వారి అంచనా. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో సొంతగడ్డపై జరగనున్న టి-20 మ్యాచ్‌లకు సన్నాహకంగా కోహ్లీ సేన ఈ మ్యాచ్‌ని ఉపయోగించుకోనుంది.ఈ హోమ్ సిరీస్‌లో భారత్ మొత్తం 9 టి-20 మ్యాచ్‌లు ఆడనుంది.
2019లో జరగనున్న వన్‌డే ప్రపంచ కప్‌కు ముందు భారత్ వరస ప్రయోగాలు చేస్తున్న దృష్ట్యా బుధవారం నాటి మ్యాచ్‌లో మొదట జట్టులో లేని రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించ వచ్చు. ఇంతకు ముందు ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లపై రెండు టి-20 మ్యాచ్‌లలో ఆడిన రిషబ్ పంత్ దక్షిణాఫ్రికాలో భారత్-ఎ జట్టు పర్యటనలో పెద్దగా రాణించలేకపోవడంతో శ్రీలంక పర్యటనకు దూరంగా ఉంచడం జరిగింది. అయితే తన తల్లి ఆరోగ్యం బాగా లేని కారణంగా శిఖర్ ధావన్ గత వారం స్వదేశానికి తిరిగి వెళ్లిన కారణంగా అజింక్య రహానే చివరి వన్‌డేలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం తెలిసిందే. ఇంతకు ముందు వెస్టిండీస్‌తో జరిగిన టి-20 మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించగా, పంత్ మూడో స్థానంలో వచ్చాడు. ఇప్పుడు కూడా కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించినట్లయితే జట్టులో ఒకటి రెండు మార్పులు ఉండే అవకాశముంది. గతంలో ఇంగ్లాండ్‌పై జరిపినట్లుగా లెగ్‌స్పిన్నర్లతో ప్రయోగం చేయాలని కోహ్లీ అనుకున్నట్లుయితే మరోసారి యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం దక్కవచ్చు.
ఇదిలా ఉండగా, వన్‌డే సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత శ్రీలంక మొదట ప్రకటించిన టి-20 జట్టులో కొన్ని మార్పులు చేసింది. లెగ్‌స్పిన్నర్ జెఫ్రీ వందర్సే, సీమ్ బౌలింగ్ ఆల్‌రౌడర్ ధవన్ శనక వీరిలో ప్రదానమైన వారు. కాగా, రెండో టెస్టుకు ముందు గాయం కారణంగా జట్టుకు దూరమైన పేస్ బౌలర్ సురంగ లక్మల్ తిరిగి జట్టులోకి రాగా స్పిన్నర్ అకిల దనంజయ్ కూడా జట్టులోకి వచ్చాడు. కాగా, కుశాల్ మెండిస్‌కు కూడా రేపటి మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.