క్రీడాభూమి

‘ స్పెయన్ బుల్ ’ 50 నాటౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్‌పోట్రో సెమీఫైనల్ బెర్తు కోసం ఈ టోర్నీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో 24వ సీడ్‌గా బరిలోకి దిగిన డెల్‌పోట్రో న్యూయార్క్‌లోని గ్రాండ్‌స్టాండ్ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో ఆస్ట్రియాకి చెందిన ఆరో సీడ్ ఆటగాడు డొమినిక్ థియెమ్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో చాలా వెనుకబడి 1-6, 2-6 తేడాతో వరుసగా రెండు సెట్లను కోల్పోయిన డెల్‌పోట్రో ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో విజృంభించాడు. ఫలితంగా 6-1, 7-6(7/1), 6-4 తేడాతో వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకుని ప్రత్యర్థిని మట్టికరిపించాడు. చేతి మణికట్టుకు జరిగిన వరుస శస్తచ్రికిత్సలతో కెరీర్‌లో దాదాపు చరమాంకానికి చేరుకున్న డెల్‌పోట్రో యుఎస్ ఓపెన్ 2009 ఎడిషన్ ఫైనల్‌లో ఫెదరర్‌ను ఓడించి ఖ్యాతి పొందిన విషయం విదితమే. కెరీర్‌లో డెల్‌పోట్రో సాధించిన ఏకైక గ్రాండ్ శ్లామ్ టైటిల్ ఇదే.
మరోవైపు ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో జర్మనీకి చెందిన ఫిలిప్ ఖోల్‌ష్క్రిబర్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్ ఆరంభం నుంచే తనదైన శైలిలో పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి ఆడిన ఫెదరర్ 6-4, 6-2, 7-5 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. దీంతో ఖోల్‌ష్క్రిబర్‌తో ఇప్పటివరకూ ఆడిన 12 మ్యాచ్‌లలోనూ ఫెదరర్ విజయం సాధించినట్లయింది.
గోఫిన్‌కు రబ్లెవ్ షాక్
అలాగే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ (31)తో పాటు రష్యాకి చెందిన యువ ఆటగాడు ఆండ్రూ రబ్లెవ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. యుఎస్ ఓపెన్ 2010, 2013 ఎడిషన్లలో టైటిళ్లు సాధించడంతో పాటు ప్రస్తుతం టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన నాదల్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో 6-2, 6-4, 6-1 తేడాతో ఉక్రెయిన్‌కి చెందిన అలెగ్జాండర్ డోల్గొపొలోవ్‌ను మట్టికరిపించి యుఎస్ ఓపెన్‌లో 50వ విజయాన్ని నమోదు చేసుకోగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 53వ స్థానంలో కొనసాగుతున్న 19 ఏళ్ల రబ్లెవ్ 7-5, 7-6(7/5), 6-3 సెట్ల తేడాతో బెల్జియంకు చెందిన 9వ సీడ్ ఆటగాడు డేవిడ్ గోఫిన్‌కు షాకిచ్చాడు. దీంతో ఆండీ రాడిక్ (2001) తర్వాత యుఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కిన రబ్లెవ్ సెమీ ఫైనల్ బెర్తు కోసం నాదల్‌తో తలపడనున్నాడు.

చిత్రం..జువాన్ మార్టిన్ డెల్‌పోట్రో (అర్జెంటీనా), రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)