క్రీడాభూమి

మహిళల సింగిల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ఈసారి యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తిని రేపుతున్నాయి. అమెరికాకు చెందిన నలుగురు క్రీడాకారిణులు సెమీ ఫైనల్స్ చేరుకోవడం ఇందుకు ఒక కారణమైతే, ఒక సెమీ ఫైనల్ ఇద్దరు నల్లజాతీయుల మధ్య జరగడం మరో కారణం. మొత్తం మీద సెమీస్, ఆతర్వాత ఫైనల్‌లో ఎవరు గెలిచినా, ట్రోఫీ మాత్రం అమెరికాకే దక్కనుంది. ఈ టోర్నీలో 1981 తర్వాత ఈ విధంగా నలుగురు అమెరికన్లు మహిళల సింగిల్స్ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్‌ను ఫేవరిట్‌గా పేర్కొంటున్నప్పటికీ, కొకొ వాండెవాగ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పరిశీలకుల అభిప్రాయం. వీనస్ సెమీస్‌లో స్లొయేన్ స్టెఫెన్స్‌ను ఢీ కొంటుంది. రెండో సెమీస్‌లో మాడిసన్ కీస్‌తో వాండెవాగ్ తలపడుతుంది. ఇప్పటి వరకూ చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే, ఫలితాలను ముందుగా అంచనా వేయడం అసాధ్యంగా కనిపిస్తున్నది. అయితే, వీనస్, వాండెవాగ్ మధ్య టైటిల్ పోరు ఉండవచ్చనే వాదన వినిపిస్తున్నది. ఇలావుంటే, ఆర్థర్ అషే స్టేడియంలో వీనస్, స్టెఫెన్స్ చేసే పోరాటాన్ని తిలకించేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ శ్లామ్ టైటిల్ గెల్చుకున్న మొట్టమొదటి నల్లజాతీయుడు ఆర్థర్ అషే. 1968లో అతను యుఎస్ ఓపెన్‌ను సాధించడం ద్వారా, అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతని పేరుతో ఉన్న స్టేడియంలోనే, ఇద్దరు అమెరికా నల్లజాతీయులు మహిళల సెమీస్ మ్యాచ్ ఆడడం సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. వీనస్ ఇదే స్టేడియంలో 20 సంవత్సరాల క్రితం తన తొలి గ్రాండ్ శ్లామ్ ఫైనల్ ఆడింది. అనారోగ్యం, ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్న ఆమె క్రమంగా వెనుకబడిపోయింది. ఒకానొక దశలో రిటర్మెంట్ ప్రకటించక తప్పదని అంతా అనుకున్నారు. కానీ, 37 ఏళ్ల వయసులో ఆమె ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించే దిశగా రాణిస్తున్నది. అనూహ్య విజయాలను నమోదు చేస్తున్నది. 2011 తర్వాత మొట్టమొదటిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ‘టాప్-5’లో చోటు దక్కించుకోనుంది. సెమీస్‌లో వీనస్‌తో తలపడుతున్న మరో నల్లజాతీయురాలు స్టెఫెన్స్ సుమారు 11 నెలలు గాయం కారణంగా టెన్నిస్‌కు దూరమైంది. ఈ ఏడాది వింబుల్డన్‌లో పోటీపడింది. యుఎస్ ఓపెన్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ సెమీస్ చేరింది. పైనల్‌లో స్థానం కోసం వీనస్‌తో ఈమె ఏ స్థాయిలో పోరాడుతుందో చూడాలి.
నంబర్ వన్‌కు షాక్
ప్రపంచ నంబర్ వన్ కరోరినా ప్లిస్కోవాకు కొకొ వాండెవాగ్ షాకిచ్చింది. క్వార్టర్ పైనల్‌లో ఆమెను 7-6, 6-3 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. వాస్తవానికి ప్లిస్కోవా ఈ మ్యాచ్‌లో పేవరిట్‌గా ముద్ర వేయించుకోగా, వాండెవాగ్ ‘అండర్ డాగ్’ ట్యాగ్‌తో బరిలోకి దిగింది. మొదటి సెట్‌లో తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్లిస్కోవా రెండో రౌండ్‌లో నీరసించింది. గట్టిపోటీ ఇవ్వకుండానే, ఓటమిపాలై నిష్క్రమించింది. కాగా, మరో క్వార్టర్ ఫైనల్‌లో మాడిసన్ కీస్ 6-3, 6-3 స్కోరుతో కయా కనేపిపై సులభంగా విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

చిత్రాలు..సెమీస్‌లో ఢీ కొంటున్న కొకొ వాండెవాగ్, మాడిసన్ కీస్
*సెమీస్ చేరిన నల్లజాతీయులు వీనస్ విలియమ్స్, స్లొయేన్ స్టెఫెన్స్