క్రీడాభూమి

వచ్చే రంజీ సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వచ్చే రంజీ సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలు స్వతంత్రంగా బరిలోకి దిగనున్నాయి. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు శుక్రవారం బిసిసిఐ పాలనాధికారు బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్‌ని కలిసి, సుమారు గంటన్నర సేపు చర్చించారు. ఈ బృందానికి కన్వీనర్‌గా వ్యవహరించిన నాబా భట్టాచార్జీ ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఈ సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిసి ఒక జట్టుగా రంజీ ట్రోఫీ ఆడుతుందని చెప్పాడు. అయితే, అండర్-16, అండర్-19, అండర్-25 విభాగాల్లో ఈ సీజన్ నుంచే స్వతంత్రంగా ఆడనున్నట్టు తెలిపాడు. అదే విధంగా వచ్చే సీజన్‌లో రంజీలోనూ ఐదు రాష్ట్రాలు వేరువేరుగా జట్లను పంపుతుందని వివరించాడు. అన్ని రాష్ట్రాలకూ బిసిసిఐలో సభ్యత్వం ఉండాలని, ఒక రాష్ట్రానికి ఒకే జట్టు, ఒకే ఓటు విధానాన్ని అనుసరించాలని లోధా కమిటీ సూచించిన విషయం విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసే బాధ్యతను సిఒఎ తీసుకుంది. అందుకే, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు సిఒఎ చీఫ్‌ను కలిసి, వచ్చే సీజన్‌లో ప్రత్యేకంగా జట్లను బరిలోకి దించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరగా, అతను సానుకూలంగా స్పందించాడని సమాచారం.