క్రీడాభూమి

కెవిన్ సెనె్సషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, సెప్టెంబర్ 8: దక్షిణాఫ్రికా టెన్నిస్ ఆటగాడు కెవిన్ ఆండర్సన్ రాత్రికి రాత్రే సంచలన క్రీడాకారుడన్న ముద్ర వేయించుకున్నాడు. న్యూయార్క్‌లో జరుగుతున్న యుఎస్ ఓపెన్ పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికా ఆటగాడు శామ్ క్వెర్రీని ఓడించి సెమీస్ చేరడమే అందుకు కారణం. 2003లో వేన్ ఫెరెరా తర్వాత ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి దక్షిణాఫ్రికా క్రీడాకారుడిగా కెవిర్ కార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. వేన్ ఫెరెరా ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ చేరాడు. అయితే, యుఎస్ ఓపెన్‌లో దక్షిణాఫ్రికా క్రీడాకారులు ఎవరూ ఇంత వరకూ నాలుగో రౌండ్ దాటలేదు. ఇన్నాళ్లూ అసాధ్యంగా కనిపిస్తున్న యుఎస్ ఓపెన్ సెమీస్‌లో అడుగుపెట్టడంతో కెవిన్‌పై స్థానిక మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తున్నది. ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ తప్ప ఇతర క్రీడల పట్ల అంతగా ఆసక్తి చూపని క్రీడాభిమానులు ఇప్పుడు కెవిన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని టెన్నిస్ సౌత్ ఆఫ్రికా (టిఎస్‌ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గ్లోవర్ అన్నాడు. దేశంలో టెన్నిస్‌కు మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించాడు.

చిత్రం..కెవిన్ ఆండర్సన్