క్రీడాభూమి

ఫైనల్‌కు స్టెఫెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 8: కెరీర్‌లో ఐదోసారి యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అందుకోవాలనుకున్న అమెరికాకు చెందిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. తన దేశానికే చెందిన స్లొయెన్ స్టెఫెన్స్ చేతిలో వీనస్ 1-6, 0-6, 5-7 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. కాగా, ఈసారి టైటిల్ పోరులో స్టెఫెన్స్ తన సహచరురాలు మాడిసన్ కీస్‌ను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో కీస్ 6-1, 6-2 తేడాతో కొకొ వాండవాగ్‌ను చిత్తుచేసింది. ఎలాంటి కష్టం లేకుండా నెగ్గిన కీస్‌కు టైటిల్ పోరులో స్టెఫెన్స్ ఎంత వరకు గట్టిపోటీనిస్తుందో చూడాలి. ఇలావుంటే, ఇద్దరూ నల్లజాతీయులే కావడంతో, వీనస్, స్టెఫెన్స్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ పోరు అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగే ముందు, సుమారు 11 నెలలు గాయం కారణంగా ఆటకు దూరమైన స్టెఫెన్స్‌ను ఇటీవల కాలంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తున్న వీనస్ సులభంగానే ఓడిస్తుందని అంతా ఊహిచారు. కానీ, మ్యాచ్ మొదటి సెట్లు జరిగిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి సెట్‌ను స్టెఫెన్స్ 6-1 తేడాతో సొంతం చేసుకుంటే, రెండో సెట్‌లో వీనస్ విజృంభించింది. ఆమెకు స్టెఫెన్స్ ఏ దశలోనూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. చివరికి సెట్ 6-0 తేడాతో స్టెఫెన్స్ ఖాతాలో చేరింది. దీనితో చివరిదైన మూడో సెట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని కూడా ఎవరో ఒకరు ఏకపక్షంగానే గెల్చుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, చివరి సెట్ అందరి అంచనాలకు భిన్నంగా కొనసాగింది. విజయం కోసం ఇరువురూ నువ్వా? నేనా? అన్న చందంగా పోరాడారు. ఒకరి తర్వాత మరొకరు పాయింట్ సంపాదిస్తూ, సమవుజ్జీగా కొనసాగారు. హోరాహోరీ పోరులో గెలిచిన స్టెఫెన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లగా, వీనస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సెమీస్‌కు సానియా జోడీ
మహిళల డబుల్స్ ఈవెంట్‌లో షుయ్ పెంగ్‌తో కలిసి ఆడుతున్న భారత స్టార్ సానియా మీర్జా సెమీ ఫైనల్ చేరింది. సానియా, పెంగ్ జోడీ క్వార్టర్ ఫైనల్‌లో ఐదో సీడ్ జోడీ తిమియా బబోస్, ఆండ్రియా హ్లావకొవా జోడీని 7-6, 6-4 తేడాతో ఓడించింది.

చిత్రాలు.. వీనస్ విలియమ్స్ షాక్
* వీనస్ విలియమ్స్‌ను ఓడించి యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ చేరిన స్లొయెన్ స్టెఫెన్స్ ఆనందం