క్రీడాభూమి

హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా మరిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టంబర్ 8: క్రీడాశాఖ మంత్రిగా ఏస్ షూటర్, ఒలింపియన్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ నుంచి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే, భారత హకీ జట్టు చీఫ్ కోచ్‌గా సుయర్డ్ మరిన్‌ను ఎంపిక చేసింది. అతను 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసే వరకూ చీఫ్ కోచ్‌గా కొనసాగుతాడు. ప్రస్తుతం అతను భారత మహిళల జట్టుకు కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈనెల 20వ తేదీన అతను బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. కోచ్ రొలాంట్ అల్ట్‌మన్స్‌ను గత శనివారం విధుల నుంచి తప్పించిన హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త కోచ్ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15వ తేదీ వరకు గడువునిచ్చింది. అయితే, మరిన్ పేరును కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధర్ సింగ్ తెరపైకి తేవడంతో, అదే ఉత్తమ నిర్యమవుతుందని, అంతకంటే మెరుగైన అభ్యర్థిని తీసుకురాలేమని హెచ్‌ఐ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అధుకారులు భావించారు. అందుకే, మరిన్ పేరును పరిశీలించి, అతనిని చీఫ్ కోచ్‌గా నియమిస్తున్నట్టు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అంతకు ముందు జారీ చేసిన ప్రకటనను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, కోచ్ అల్ట్‌మన్స్‌తోపాటు, హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్‌కు కూడా హెచ్‌ఐ ఉద్వాసన పలికి, అతని స్థానాన్ని హరేంద్ర సింగ్‌తో భర్తీ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే, హెచ్‌ఐ తాజాగా అతనిని మహిళల జట్టు చీఫ్ కోచ్‌గా హరేంద్ర సింగ్‌ను నియమించింది.
పురుషుల జట్టుకు ఆల్ట్‌మన్స్ నాలుగేళ్ల క్రితం కోచ్‌గా నియమితుడుకాగా, మహిళల జట్టు చీఫ్ కోచ్‌గా మరిన్‌ను ఈఏడాది ఫిబ్రవరిలో ఎంపిక చేశారు. ఆల్ట్‌మన్స్ మార్గదర్శకంలో భారత జట్టు మెరుగైన ఫలితాలే రాబట్టింది. రియో ఒలింపిక్స్‌లో ఆడే అర్హతను సంపాదించింది. అంతార్జతీయ వేదికలపై రాణిస్తూ, మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేసింది. అయితే, సుమారు ఏడాది కాలంగా భారత జట్టు పతనం మొదలైంది. వరుస వైఫల్యాలు జట్టును వేధిస్తున్నాయి. ఆల్ట్‌మన్స్ తీసుకుంటున్న నిర్ణయాలు, అతను అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు భారత జట్టుకు తలనొప్పిగా మారాయన్న విమర్శలున్నాయి. దీనితో హెచ్‌ఐ అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆల్ట్‌మన్స్ వల్ల జట్టుకు ఒనగూరుతున్న ప్రయోజనం దాదాపుగా ఏమీ లేదని నిర్ధారణ చేశారు. అంతేగాక, అతను ముందుగా ఎవరినీ సంప్రదించకుండానే నేరుగా ప్రెస్‌మీట్స్ పెట్టడం, వివిధ కీలక నిర్ణయాలను ప్రకటించడం కూడా హెచ్‌ఐ అధికారులకు ఆగ్రహం తెప్పించింది. అందుకే, సుమారు వారం రోజుల క్రితం అతనిని కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. ప్రకటననిచ్చి, దరఖాస్తులను పరిశీలించి, దరఖాస్తుదారులతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని తొలుత నిర్ణయించింది. కానీ, కేంద్ర క్రీడా మంత్రిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న రాజ్యవర్ధన్ సింగ్ వేగంగా స్పందించి, మరిన్ పేరును ప్రతిపాదించడంతో, కోచ్ పదవికి జారీ చేసిన ప్రకటనను రద్దు చేసింది. మంత్రి కోరిన విధంగానే మారిన్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. మహిళల జట్టుకు అతను ఉత్తమ సేవలు అందిస్తున్నాడని, పురుషుల జట్టుకు కూడా సరైన దిశా నిర్దేశనం చేస్తాడని ఆశిస్తున్నామని పేర్కొంది. కానీ, హాకీ ప్రముఖులు ఈ చర్యను విమర్శిస్తున్నారు.

చిత్రం.సుయర్డ్ మరిన్