క్రీడాభూమి

బ్రెజిల్ అండర్-17 జట్టులో టీనేజ్ సంచలనం వినిసియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 9: టీనేజ్ సంచలనం వినిసియస్ జూనియర్‌కు బ్రెజిల్ అండర్-17 జట్టులో చోటు కల్పించారు. భారత్‌తో జరిగే ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసిన జట్టులో వినిసియస్‌ను తీసుకున్నట్టు బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. 16 ఏళ్ల వినిసియస్ 2013లో సాంటోస్ నుంచి బార్సిలోనాకు ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లినప్పుడు, నేమార్ తర్వాత అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఫ్లెమింకో క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతని చేరికతో బ్రెజిల్ జట్టు మరింత బలపడింది.
జట్టు వివరాలు
గోల్‌కీపర్లు: గాబ్రియెల్ బ్రజావో, లుకాస్ అలెగ్జాండ్రె, యూరీ సెనా.
డిఫెండర్లు: వెస్లీ, లువాన్ కాండిడో, వెవెర్సన్, లుకాస్ హాల్టర్, మాథియస్ స్టాక్, రోడ్రిగో గత్, విక్టర్ ఈక్వార్డో.
మిడ్‌ఫీల్డర్స్: అలాన్ డి సౌజా, మార్కొస్ ఆంటానియో, రోడ్రిగో నెస్టర్, విక్టర్ బొబ్సిన్, విక్టర్ యాన్, విటిన్హో.
ఫార్వర్డ్స్: బ్రెనెర్, లింకన్, పౌలిన్హో, విసియస్ జూనియర్, యూరీ అల్బర్టో.