క్రీడాభూమి

అశ్విన్ ఇటా? అటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఇంగ్లీష్ కౌంటీ కాంట్రాక్టు పూర్తయ్యే వరకూ కదపకుండా అక్కడే ఉంచుతారా లేక స్వదేశానికి పిలిపిస్తారా అన్నది ఆసక్తిని రేపుతుండగా, ఆస్ట్రేలియాతో జరిగే వనే్డ సిరీస్ మొదటి మ్యాచ్‌లకు టీమిండియా ఎంపిక ఆదివారం జరగనుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రస్తుతం లక్నోలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను తిలకిస్తుండగా, ఇద్దరు సభ్యులు శరణ్‌దీప్ సింగ్ ఢిల్లీలో, దేవాంగ్ గాంధీ కోల్‌కతాలో ఉన్నారు. ఈ ముగ్గురూ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జట్టును ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ వర్సెస్టర్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్విన్ అక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మూడో మ్యాచ్ ఈనెల 12 నుంచి 15 వరకు లీసెస్టర్‌షైర్‌తో, చివరిదైన నాలుగో మ్యాచ్ 25-28 వరకు దర్హంతో జరుగుతాయి. ఒకవేళ ఆసీస్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లకు అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపిక చేస్తే, అతను కౌంటీ క్లబ్‌లో ఆడాల్సిన రెండు మ్యాచ్‌లను కోల్పోతాడు. యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో అశ్విన్‌ను కౌంటీ క్లబ్‌లో కాంట్రాక్టు పూర్తయ్యే వరకూ ఉంచుతారా లేక ఆస్ట్రేలియా బలమైన జట్టు కాబట్టి స్వదేశానికి పిలిపిస్తారా అన్నది చూడాలి. వచ్చే మూడు నెలల కాలంలో భారత్ మొత్తం 11 వనే్డ, తొమ్మిది టి-20, మూడు టెస్టులు సహా మొత్తం 23 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడుతుంది. కాబట్టి, ఎక్కువ మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని సెలక్షన్ కమిటీ భావిస్తే, అశ్విన్‌ను హడావుడిగా పిలిపించకపోవచ్చు. ఇలావుంటే, భువనేశ్వర్ కుమార్ లేదా జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఉమేష్ యాదవ్ లేదా మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బ్యాటింగ్ విభాగానికి వస్తే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్-కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, కేదార్ జాధవ్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాలను పదిలంగా ఉంటాయి. సీమర్ ఆల్‌రౌండర్ హోదాలో హార్దిక్ పాండ్య తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. మిగతా స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది.

చిత్రం..రవిచంద్రన్ అశ్విన్