క్రీడాభూమి

52 ఏళ్ల తర్వాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: సుమారు 52 సంవత్సరాల తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా కెవిన్ ఆండర్సన్ రికార్డు నెలకొల్పాడు. సెమీ ఫైనల్‌లో అతను పాబ్లో కరెనో బస్టాను 4-6, 7-5, 6-3, 6-4 తేడాతో ఓడించి, రాఫెల్ నాదల్‌తో టైటిల్ పోరును ఖరారు చేసుకున్నాడు. మొత్తం మీద గ్రాండ్ శ్లామ్స్‌లో దక్షిణాఫ్రికాకు చెప్పుకోదగిన రికార్డు లేదు. 1981లో జొహాన్ క్రియెక్ ద్వారా ఆ దేశానికి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ లభించింది. యుఎస్ ఓపెన్‌లో, 1965లో క్లిఫ్ డ్రిస్‌డేల్ చివరిసారి ఫైనల్ చేరాడు. ఆతర్వాత టైటిల్ పోరు వరకూ వచ్చిన దక్షిణాఫ్రికా క్రీడాకారుడిగా ఆండర్సన్ పేరు చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కింది. యుఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా మరో రికార్డును సృష్టించాలంటే అతను తుది పోరులో రాఫెల్ నాదల్‌ను ఓడించాలి. అది సులభం కాకపోయినా, అసాధ్యం మాత్రం కాదు.

చిత్రం..కెవిన్ ఆండర్సన్