క్రీడాభూమి

‘రఫా’డించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 9: ప్రపంచ నంబర్ వన్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ చేరాడు. జువాన్ మార్టిన్ డెల్ పొట్రోతో జరిగిన సెమీ ఫైనల్‌లో మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, ప్రత్యర్థిని 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో చిత్తుచేశాడు. మెరుపు వేగంతో సర్వీసులు చేస్తూ, బలమైన రిటర్న్స్‌తో విరుచుకుపడి సంచలన విజయాలను నమోదు చేసిన డెల్ పొట్రో సెమీ ఫైనల్‌లో నాదల్‌పై అదే స్థాయిలో రాణించలేకపోయాడు. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ అతను నీరసపడితే, నాదల్ ప్రతి పాయింట్‌కూ రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుపడ్డాడు. యుఎస్ ఓపెన్‌లో నాలుగేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన నాదల్ ఈసారి టైటిల్ ఫేవరిట్ ముద్ర వేయించుకున్నాడు. ఆ స్థాయికి తగినట్టుగానే సెమీ ఫైనల్‌ను సమర్థంగా పూర్తి చేశాడు.
అర్జెంటీనాకు చెందిన డెల్ పొట్రో మ్యాచ్ ఆరంభంలో నాదల్‌పై పైచేయి సాధించాడు. కొద్దిపాటి కష్టంతో ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, రెండో సెట్ నుంచి రఫా నుంచి ఎదురైన ప్రతిఘటనను అడ్డుకోలేకపోయాడు. ప్రతి పాయింట్‌కీ ఎంతో కష్టపడ్డాల్సి రావడంతో, నీరసపడిపోయాడు. మరోపక్క నాదల్ విజృంభణ కొనసాగింది. దీనితో ఏం చేయాలో, ఎలా ప్రతిఘటించాలో అర్థంగాక డెల్ పొట్రో చేతులెత్తేశాడు. తీవ్రమైన ఒత్తిడికి గురైన అతను బంతిని పదేపదే నెట్‌కు కొట్టి, ఒటమిని కొని తెచ్చుకున్నాడు. కాగా, నాదల్ కెరీర్‌లో 23వ సారి, ఈ ఏడాది మూడోసారి గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరాడు.
అర్జెంటీనా ఆటగాడు జువాన్ డెల్ పొట్రోను పట్టుదలకు మారుపేరుగా చెప్పుకోవాలి. బలమైన సర్వీసులు చేసే అతని చేతి మణికట్టుకు నాలుగు సార్లు శస్త్ర చికిత్సలు జరిగాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా నాలుగో స్థానాన్ని ఆక్రమించిన అతను ఫిట్నెస్ సమస్యల కారణంగా 10 గ్రాండ్ శ్లామ్ టోర్నీలకు దూరమయ్యాడు. ఒకానొక దశలో, 1,405 స్థానానికి పడిపోయాడు. ఆరు అడుగుల, ఆరు అంగుళాల ఎత్తుతో, అథ్లెటిక్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలను తనలో ఇముడ్చుకున్న డెల్ పొట్రోను ఎదుర్కోవడానికి హేమాహేమీలు కూడా భయపడతారు. ఎన్నో పర్యాయాలు టైటిల్ ఫేవరిట్స్‌ను చిత్తుచేసి, ‘జెయింట్ కిల్లర్’ అని పేరు తెచ్చుకున్నాడు. ఈ టోర్నీలోనూ అద్వితీయ ప్రతిభను కనబరిచినా, ప్రపంచ నంబర్ వన్ నాదల్ ముందు నిలవలేకపోయాడు. వరుసగా తొమ్మిది గేమ్స్‌ను చేజార్చుకున్నాడంటే, అతని ఎంత తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడో స్పష్టమవుతుంది. మొత్తం మీద యుఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ద్వారా డెల్ పొట్రో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు నిరూపించుకున్నాడు.

సానియా ఔట్
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ నుంచి భారత స్టార్ సానియా మీర్జా సెమీస్ నుంచి నిష్క్రమించింది. షుయ్ పెంగ్‌తో కలిసి డబుల్స్ విభాగంలో ఆడిన సానియా 4-6, 4-6 తేడాతో చాన్ యుంగ్ జాన్, మార్టినా హింగిస్ జోడీ చేతిలో ఓటమిపాలైంది.

చిత్రం..రాఫెల్ నాదల్