క్రీడాభూమి

ఆండర్సన్ 500 నాటౌట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లార్డ్స్, సెప్టెంబర్ 9: జేమ్స్ ఆండర్సన్ కెరీర్‌లో 500 టెస్టు వికెట్ల మైలురాయిని చేరగా, వెస్టిండీస్‌తో జరిగిన చివరి, మూడో టెస్టును ఇంగ్లాండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో కైవసం చేసుకొని, సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో క్లీన్‌స్వీప్ చేసింది. కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణతో రాణించిన ఆండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 42 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 500 టెస్టు వికెట్ల మైలురాయిని చేరాడు. అతని ఖాతాలో ఇప్పుడు 506 వికెట్లు ఉన్నాయి. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 123 పరుగులకే ఆలౌటైంది. కీరన్ పావెల్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బెన్ స్టోక్స్ 22 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, విండీస్‌ను దెబ్బతీశాడు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 60 పరుగులు సాధించాడు. కెమెర్ రోచ్ 72 పరుగులకు ఐదు, జాసన్ హోల్డర్ 54 పరుగులకు నాలుగు చొప్పున వికెట్లు కూల్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు వెనుకబడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైంది. 65.1 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. షాయ్ హోప్ 62 పరుగులు సాధించాడు. ఆండర్సన్ 42 పరుగులకు ఏడు, స్టువర్ట్ బ్రాడ్ 35 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు. అనంతరం 107 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 28 ఓవర్లలో, ఒక వికెట్ (అలస్టర్ కుక్ 17) కోల్పోయి ఛేదించింది. మార్క్ స్టోన్‌మన్ 40, టామ్ వెస్ట్‌లే 44 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్‌లో వెస్టిండీస్ ఒక టి-20 ఇంటర్నేషనల్, ఐదు వనే్డలు కూడా ఆడుతుంది.