క్రీడాభూమి

కర్న్‌కు ఆరు వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 10: దులీప్ ట్రోఫీలో ఆదివారం ముగిసిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా గ్రీన్‌పై ఇండియా రెడ్ 170 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్ కర్న్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి, రెడ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. గ్రీన్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ సెంచరీ చేసినప్పటికీ, తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రెడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు సాధించింది. అనంతరం గ్రీన్‌ను 157 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రెడ్ 2 వికెట్లకు 307 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది. 474 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన గ్రీన్ 89.2 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 120 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన కర్న్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులకు ఆరు వికెట్లు సాధించాడు.