క్రీడాభూమి

మెస్సీ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, సెప్టెంబర్ 10: సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్‌తో రాణించడంతో, స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా ఎస్పానియల్‌తో జరిగిన మ్యాచ్‌ని బార్సిలోనా 5-0 తేడాతో గెల్చుకుంది. పాయింట్ల పట్టికలో తన సమీప ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ కంటే బార్సిలోనా నాలుగు పాయింట్లు ఆధిక్యంలో నిలవడం విశేషం. ఎస్పానియల్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి నుంచి దూకుడుగా ఆడిన బార్సిలోనాకు 26వ నిమిషంలో మెస్సీ తొలిగోల్‌ను అందించాడు. మరో తొమ్మిది నిమిషాల తర్వాత రెండో గోల్ చేసి, బార్సిలోనాను ఆధిక్యంలో నిలిపాడు. ద్వితీయార్ధంలోనూ బార్సిలోనా ఆధిపత్యం కొనసాగింది. చాలా సేపు రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన ఆ జట్టు చివరిలో దాడులను ఉద్ధృతం చేసింది. 67వ నిమిషంలో గోల్ చేసిన మెస్సీ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. 87వ నిమిషంలో గెరార్డ్ పిక్, మరో మూడు నిమిషాల తర్వాత లూయిస్ సొరెజ్ గోల్స్ చేసి, బార్సిలోనాకు తిరుగులేని విజయాన్ని అందించారు.

చిత్రం.. హ్యాట్రిక్ వీరుడు మెస్సీ