క్రీడాభూమి

యుకీ, రాంకుమార్‌పైనే ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్మాంటన్, సెప్టెంబర్ 14: కెనడాతో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ పోటీల్లో యుకీ భంబ్రీ, రాంకుమార్ రామనాథన్‌పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ పోటీలకు ఎంపిక చేసిన జట్టులో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు చొటు దక్కని విషయం తెలిసిందే. బద్ధ శత్రువుగా మారిన ఒకప్పటి అతని డబుల్స్ భాగస్వామి మహేష్ భూపతి భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఉండడమే పేస్ ఉద్వాసనకు కారణమైందన్నది బహిరంగ రహస్యం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన డేవిస్ కప్ పోటీలకు తొలుత ఎంపిక చేసిన ఆరుగురు సభ్యుల జట్టులో పేస్ ఉన్నాడు. అయితే, చివరి నలుగురుగురి ఖరారు చేసినప్పుడు ఆ జాబితాలో అతని పేరు లేదు. తనపై కుట్ర జరుగుతున్నదని పేస్ ఆరోపణలు గుప్పించినా భూపతి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కెనడాతో జరిగే డేవిస్ కప్ పోటీల్లో పేస్ లేకుండా చూడగలిగాడు. ఇలావుంటే, పేస్ లేని కారణంగా యుకీ, రాంకుమార్‌పై భారం పెరిగిందనే చెప్పాలి. నిజానికి వీరిద్దరూ ఈ ఏడాది ఆరంభంలో దారుణంగా విఫలమవుతూ అభిమానులను నిరాశపరిచారు. అయితే, క్రమంగా కోలుకొని, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. 18 ఏళ్ల యువ సంచలన ఆటగాడు డెనిస్ షపొవలోవ్‌తో కూడిన కెనడాను వీరిద్దరూ ఎంత వరకూ కట్టడి చేస్తారో చూడాలి. మాంట్రియల్ మాస్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన టీనేజ్ ఆటగాడు షపొవలోవ్ ఇటీవల ముగిసిన యుఎస్ ఓపెన్‌లో ప్రీ క్వార్టర్స్ వరకూ చేరి సత్తా చాటాడు. తాను ఆడిన రెండో గ్రాండ్ శ్లామ్ టోర్నీలోనే నాలుగో రౌండ్ వరకూ చేరడం ఆ యువ ఆటగాడి ప్రతిభకు నిదర్శనం. జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, జో విల్‌ఫ్రైడ్ సొంగా వంటి మేటి ఆటగాళ్లపై విజయాలను తన ఖాతాలో వేసుకున్న షపొవలోవ్ నుంచి మరోసారి అత్యుత్తమ ప్రదర్శనను కెనడా కోరుకుంటున్నది. భారత జట్టులో సాకేత్ మైనేని, రోహన్ బొపన్న కూడా ఉన్నప్పటికీ, అందరి దృష్టి యుకీ, రాంకుమార్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ పరీక్షలో వీరిద్దరూ రాణిస్తారా అనుమానం అభిమానులను వేధిస్తున్నది.