క్రీడాభూమి

జోరు తగ్గని రొనాల్డో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, సెప్టెంబర్ 14: రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. ఆఫ్ సీజన్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మళ్లీ మైదానంలోకి దిగిన అతను అపోయెల్ నికొసియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి, రియల్ మాడ్రిడ్‌కు 3-0 తేడాతో విజయాన్ని అందించాడు. మ్యాచ్ మొదటి నుంచే రొనాల్డో చెలరేగడంతో నికొసియా ఆటగాళ్లు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రొనాల్డో 12వ నిమిషంలో తొలి గోల్‌ను సాధించాడు. ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత రియల్ మాడ్రిడ్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నికొసియాను గోల్స్ చేయకుండా అడ్డుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. దీనితో ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో రొనాల్డో అదునుచూసి దాడులకు ఉపక్రమించాడు. 51వ నిమిషంలో అతని ప్రయత్నం ఫలించింది. రియల్ మాడ్రిడ్‌కు రెండో గోల్ లభించింది. మరో పది నిమిషాల తర్వాత సెర్గియో రామోస్ ద్వారా మూడో గోల్ అందడంతో, తిరుగులేని ఆధిక్యానికి దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్ డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేయడంతో నికొసియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.
స్టొనెస్ డబుల్
జాన్ స్టొనెస్ రెండు గోల్స్ చేయడంతో, చాంపియన్స్ లీగ్‌లో ఫెనెనూర్డ్‌పై మాంచెస్టర్ సిటీ 4-0 తేడాతో విజయభేరి మోగించింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే స్టొనెస్ తొలి గోల్ చేయగా, మరో ఎనిమిది నిమిషాల్లో సెర్గియో అగెరో ద్వారా మాంచెస్టర్ సిటీకి రెండో గోల్ లభించింది. 25వ నిమిషంలో గాబ్రియల్ జీసెస్ గోల్ సాధించగా, 63వ నిమిషంలో స్టొనెస్ తన రెండో గోల్‌ను నమోదు చేశాడు. పూర్తిగా ఆత్మరక్షణలో పడిన ఫెనెనూర్డ్ ఒక్క గోల్ కూడా చేయలేదు.