క్రీడాభూమి

మహిళా బాక్సింగ్ కోచ్ కొటాలార్డా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: భారత మహిళా బాక్సింగ్ తొలి విదేశీ కోచ్ స్ట్ఫోన్ కొటాలార్డా తన పదవికి రాజీనామా చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన 41 ఏళ్ల అతను భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి రాసిన తన రాజీనామా లేఖలో తీవ్ర పదజాలాన్ని ఉపయోగించాడు. తనకు ఇచ్చిన హామీలను బిఎఫ్‌ఐ నెరవేర్చలేదని, ఈ పరిస్థితుల్లో భారత బృందానికి సేవలు అందించడం సాధ్యం కాదని ఒక స్పష్టం చేశాడు. 3నాకు చాలా ఓపిక ఉంది. కానీ, ఎంత సహనంతో వేచిచూసినా, బిఎఫ్‌ఐ నుంచి సరైన స్పందన లేదు. దీనితో నేను భారత్ నుంచి ఫ్రాన్స్‌కు వచ్చేశాను. ఇక్కడ నా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాను2 అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆగస్టు నెల జీతం తనకు అందలేదని, ఈ విషయంపై ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టినా బిఎఫ్‌ఐ పట్టించుకోలేదని ఆరోపించాడు. తనకు బస కూడా ఏర్పాటు చేయలేదని, ఎక్కడ ఉండాలో అర్థంకాని పరిస్థితుల్లో స్వదేశానికి చేరుకోవడం మినహా మరో మార్గం లేకపోయిందని తనకు ఎదురైన చేదు అనుభవాలను అతను రాజీనామా లేఖలో వివరించాడు. బిఎఫ్‌ఐ అధికారుల్లో మహిళా బాక్సింగ్ అభివృద్ధి పట్ల సరైన వ్యూహంగానీ, అంకిత భావంగానీ లేవని స్పష్టమవుతున్నదని కొటాలార్డా వ్యాఖ్యానించాడు. ఇలావుంటే, అతని డిమాండ్లను వెంటనే తీరుస్తామని బిఎఫ్‌ఐ ప్రకటించింది. అతనిని వెనక్కు రప్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.