క్రీడాభూమి

క్వార్టర్స్‌కు సింధు, సమీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 14: ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పివి సింధు ఇక్కడ జరుగుతున్న కొరియా సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో సింధు 22-20, 21-17 తేడాతో థాయిలాండ్‌కు చెందిన నిచవోన్ జిందాపోల్‌ను ఓడించింది. సెమీస్‌లో స్థానం కోసం ఆమె జపాన్ క్రీడాకారిణి మినాత్సు మితానీని ఢీ కొంటుంది. మితానీ క్వార్టర్ ఫైనల్స్‌లో నంబర్ వన్ సీడ్ తాయ్ జూ ఇంగ్‌ను 23-21, 14-21, 21-18 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచి, హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో రన్నరప్ ట్రోఫీని దక్కించుకున్న సమీర్ రెండో రౌండ్‌లో 41 నిమిషాలు పోరాడి, వాంగ్ వింగ్ కి వినె్సంట్‌పై 21-19, 21-13 ఆధిక్యంతో విజయం సాధించాడు. అతను క్వార్టర్స్‌లో స్థానిక ఆటగాడు సాన్ వాన్ హోను ఢీ కొంటాడు. అంతకు ముందు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో వాన్ హో 21-16, 17-21, 21-16 స్కోరుతో భారత స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ను ఓడించాడు. విజయం కోసం కశ్యప్ చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. సాయి ప్రణీత్ కూడా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. అతనిపై ఏడో సీడ్ జూ వెయ్ వాంగ్ 21-13, 26-24 ఆధిక్యంతో గెలిచాడు. ఈ మ్యాచ్ కూడా చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ముందంజ వేసింది. వీరు 23-21, 16-21, 21-8 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లీ జీ హుయ్, లీ యాంగ్ జోడీని 51 నిమిషాలు జరిగిన పోరాటంలో ఓడించి క్వార్టర్స్ చేరారు.

చిత్రాలు.. పివి సింధు * సమీర్ వర్మ