క్రీడాభూమి

తెలుగు టైటాన్స్‌పై పాట్నా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, సెప్టెంబర్ 16: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి హరివంశ్ తానా భగత్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాట్నా పైరేట్స్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి, తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఆ జట్టు 46 పాయింట్లు సంపాదించగా, టైటాన్స్‌కు 30 పాయింట్లు దక్కాయి. పాట్నా తరఫున పరదీప్ నర్వాల్ 14, మోనూ గోయత్ 10 పాయింట్లు సాధించి, తమ జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. టైటాన్స్ తరపున రాహుల్ చౌదరి (7 పాయింట్లు), సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వికాస్ (5 పాయింట్లు) తప్ప మిగతా వారు చెప్పుకోదగిన స్థాయిలో ఆడలేకపోయారు.