క్రీడాభూమి

డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ భారత్‌కు కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్మాంటన్ (కెనడా), సెప్టెంబర్ 15: కెనడాతో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో భారత్‌కు కఠిన పరీక్ష తప్పేటట్టు లేదు. 18 ఏళ్ల సంచలన ఆటగాడు డెనిస్ షపొవలోవ్‌ను తొలి పరీక్షలో యుకీ భంబ్రీ ఎంత వరకూ నిలువరిస్తాడరన్నది అనుమానమే. రాంకుమార్ రామనాథన్ తన తొలి మ్యాచ్‌లో 22 ఏళ్ల బ్రేడన్ షనర్‌తో తలపడతాడు. ఈ మ్యాచ్‌లో రాంకుమార్ గెలిచినా, రివర్స్ సింగిల్స్‌లో అతను షపొవలోవ్‌ను ఎదుర్కోవాలి. రివర్స్ సింగిల్స్ రెండో మ్యాచ్‌లో షనర్‌తో యుకీ భంబ్రీ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా, రోహన్ బొపన్న, పూరవ్ రాజా జోడీ డబుల్స్‌లో డానియల్ నెస్టర్, వాసెక్ పొస్పిల్ జోడీని ఎదుర్కొంటుంది. మొత్తం మీద ఈ పోటీలు భారత్‌కు అగ్ని పరీక్షగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత మొదలయ్యే ఈ పోటీల్లో భారత్‌కు యుకీ భంబ్రీ శుభారం భాన్ని ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయతే, అతను ఎదు ర్కోవాల్సింది ప్రపంచ మేటి ఆటగాళ్లను సైతం కంగు తినిపిస్తున్న షపొవలోవ్‌ను కావడంతో ఈ మ్యాచ్ ఫలితం భారత్‌కు అనుకూ లంగా ఉండదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ.