క్రీడాభూమి

‘టాప్’ అథ్లెట్లకు ఆర్థిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టోక్యో ఒలింపిక్స్‌తోపాటు ఆసియా క్రీడలు, కామనె్వల్త్ గేమ్స్‌కు ప్రత్యేక శిక్షణ పొందుతున్న అథ్లెట్లకు ఖర్చుల కింద నెలకు 50,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) పేరుతో వివిధ రంగాల్లో సమర్థులైన క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. అభినవ్ బింద్రా నేతృత్వంలో ఏర్పడిన ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, సమర్థులను గు ర్తిస్తుంది. వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు అవసరమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. అయితే, శిక్షణ సమయంలో ఇతరత్రా ఖర్చు ల కోసం తలా యాభై వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ఒలింపియన్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపాడు.
పేస్, సాకేత్ పేర్లు తొలగింపు
వచ్చే ఏడాది జరిగే వివిధ టోర్నీల్లో పాల్గొనే టెన్నిస్ క్రీడాకారులకు అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం, ఆ జాబితా నుంచి వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్, సాకేత్ మైనేనీ పేర్లను తొలగించింది. యుకీ భంబ్రీ, రాంకుమార్ రామనాథన్, రోహన్ బొపన్న, సుమిత్ నాగల్ నెలకు యాభై వేల రూపాయల అలవెన్స్ పొందనున్నారు. ఈ జాబితాలో ముగ్గురు క్రీడాకారిణులు, సానియా మీర్జా, ప్రార్థనా థొంబారే, కర్మాన్ కౌర్ థండి ఉన్నారు. ఆసియా గేమ్స్ నుంచి ఒలింపిక్స్ వరకూ వివిధ మేజర్ టోర్నీల్లో పతకాలు సాధించే సామర్థ్యం ఉన్న 152 మందిని ‘టాప్’ పథకం కింద గుర్తించారు. ఇకపై వీరందరికీ స్టయిపెండ్ లభిస్తుంది.

చిత్రం..లియాండర్ పేస్