క్రీడాభూమి

పాకిస్తాన్ ఖాతాలో టి-20 సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 15: చాలాకాలం తర్వాత స్వదేశంలో జరిగిన టి-20 ఇంటర్నెషనల్ సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. వరల్డ్ ఎలెవెన్‌తో శుక్రవారం జరిగిన చివరి, మూడో మ్యాచ్‌లో ఈ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు సాధించిన పాక్ ఆతర్వాత ప్రత్యర్థిని 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగుల వద్ద కట్టడి చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
టాస్ గెలిచిన వరల్డ్ ఎలెవెన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఫకర్ జమాన్, అహ్మద్ షెజాద్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. 61 పరుగులు జోడించిన తర్వాత ఫకర్ జమాన్ రనౌట్ కావడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. 55 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసిన అహ్మద్ షెజాద్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి పాక్ స్కోరు 163 పరుగులు. బాబర్ ఆజమ్ చివరి ఓవర్ మొదటి బంతికి వెనుదిరిగాడు. అతను 31 బంతులు ఎదుర్కొని 48 పరుగులు సాధించి, తిసర పెరెరా బౌలింగ్‌లో ఫఫ్ డు ప్లెసిస్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అదే ఓవర్ ఐదో బంతికి ఇమాన్ వసీం (0) కూడా కూలింది. అతను కూడా బాబర్ ఆజమ్ అవుటైన విధంగానే వికెట్ చేజార్చుకున్నాడు. పాక్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 183 పరుగులు సాధించగా, సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ (17), సర్ఫ్‌రాజ్ అహ్మద్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తిసర పెరెరాకు రెండు వికెట్లు లభించాయి.
పాక్‌ను ఓడించి, సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి 184 పరుగులు చేయాల్సిన వరల్డ్ ఎలెవెన్ 15 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. తమీమ్ ఇక్బాల్ 14 పరుగులు చేసి ఉస్మాన్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెన్ కట్టింగ్ ఐదు పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో బౌల్డ్‌కాగా, రెండో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన షహీం ఆమ్లా 12 బంతుల్లో 21 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. జార్జి బెయిలీ (3), కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. రెండో మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవెన్‌కు విజయాన్ని అందించిన తిసర పెరెరా ఈ మ్యాచ్‌లోనూ విజృంభించాడు. కేవలం 13 బంతులు ఎదుర్కొన్న అతను రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి రుమాన్ రయిస్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. చివరిలో డారెన్ సమీ (24 నాటౌట్), శామ్యూల్ బద్రీ (0 నాటౌట్) వికెట్ కూలకుండా జాగ్రత్త పడినప్పటికీ, పరుగుల వేటలో విఫలమయ్యారు. ఫలితంగా వరల్డ్ ఎలెవెన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులు చేయగలిగింది. పాకిస్తాన్ 33 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

స్కోరుబోర్డు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫకర్ జమాన్ రనౌట్ 27, అహ్మద్ షెజాద్ రనౌట్ 89, బాబర్ ఆజం సి ఫఫ్ డు ప్లెసిస్ బి తిసర పెరెరా 48, షోయబ్ మాలిక్ 17 నాటౌట్, ఇమాద్ వసీం సి ఫఫ్ డు ప్లెసిస్ బి తిసర పెరెరా 0, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 183.
వికెట్ల పతనం: 1-61, 2-163, 3-175, 4-182.
బౌలింగ్: శామ్యూల్ బద్రీ 3-0-28-0, మోర్న్ మోర్కెల్ 4-0-42-0, బెన్ కట్టింగ్ 2-0-26-0, తిసర పెరెరా 4-0-37-2, డారెన్ సమీ 4-0-24-0, ఇమ్రాన్ తాహిర్ 3-0-26-0.
వరల్డ్ ఎలెవెన్: తమీమ్ ఇక్బాల్ బి ఉస్మాన్ ఖాన్ 14, హషీం ఆమ్లా రనౌట్ 21, బెన్ కట్టింగ్ బి హసన్ అలీ 5, ఫఫ్ డు ప్లెసిస్ రనౌట్ 13, జార్జి బెయిలీ బి ఇమాద్ వసీం 3, డేవిడ్ మిల్లర్ సి బాబర్ ఆజం బి హసన్ అలీ 32, డారెన్ సమీ 24 నాటౌట్, తిసర పెరెరా సి బాబర్ ఆజం బి రుమాన్ రయిస్ 32, మోర్న్ మోర్కెల్ రనౌట్ 1, శామ్యూల్ బద్రీ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1-15, 2-41, 3-41, 4-53, 5-67, 6-112, 7-137, 8-139.
బౌలింగ్: ఇమాద్ వసీం 4-0-34-1, ఉస్మాన్ ఖాన్ 4-0-26-1, హసన్ అలీ 4-0-28-2, రుమాన్ రయస్ 4-1-20-1, మహమ్మద్ నవాజ్ 1-0-7-0, షాదాబ్ ఖాన్ 3-0-34-0.