క్రీడాభూమి

గాడ్ ఫాదర్ లేడు కోచ్ పదవి రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేడని, అందుకే టీమిండియా కోచ్ పదవి రాలేదని భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ఎప్పుడూ కోచ్ పదవికి దరఖాస్తు చేయనని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెవాగ్ స్పష్టం చేశాడు. అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త కోచ్‌ని ఎంపిక చేయడానికి బిసిసిఐ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు సెవాగ్ తొలుత ఆసక్తి చూపలేదు. ఇదే విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, నిజానికి టీమిండియాకు కోచ్‌గా ఉండాలని తాను ఎన్నడూ అనుకోలేదని అన్నాడు. అయితే, బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, జనరల్ మేనేజర్ ఎంవి శ్రీ్ధర్ తనను కలిసి ఈ ప్రతిపాదన చేశారని సెవాగ్ అన్నాడు. వారు పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత తాను దరఖాస్తు చేసేందుకు అంగీకరించానని అన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా మాట్లాడానని, అతను సానుకూలంగా స్పందించడంతో దరఖాస్తు చేశానని వివరించాడు. కానీ, కోచ్‌గా ఎంపికయ్యేందుకు అవసరమైన పలుకుబడి తనకు లేదని, లాబీయింగ్ చేయడం చేతకాదని వ్యాఖ్యానించాడు. చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు తాను ఇంగ్లాండ్ వెళ్లానని, అప్పుడు రవి శాస్ర్తీని కలిశానని సెవాగ్ చెప్పాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేయడం లేదని అతను తనకు స్పష్టం చేశాడని, గతంలో ఒకసారి పరువు పోగొట్టుకున్న తాను మరోసారి అదే అవమానాన్ని ఎదుర్కోదలచుకోలేదని వ్యాఖ్యానించాడని అన్నాడు. కోచ్ పదవిని కోరుకుంటున్నానని, దరఖాస్తు చేస్తున్నానని రవి శాస్ర్తీ ముందుగానే చెప్పివుంటే, తాను రేసులో నిలిచేవాడినే కానని చెప్పాడు. ఇక ముందు ఎన్నడూ కోచ్ పదవిని కోరుకోనని, దరఖాస్తు కూడా చేయనని అన్నాడు. నిజానికి ఎవరైనా గాడ్ ఫాదర్ ఉం టే తప్ప పదవులు రావన్న విషయం తనకు అప్పట్లో తెలియదని వ్యాఖ్యానించాడు. బో ర్డు అధికారులను ఆదేశించే స్థాయ ఉన్న వారెవరూ తనకు పరిచయం లేరన్నాడు.