క్రీడాభూమి

ఓపెనర్‌గా రహానే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 15: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు సేవలు అందించేందుకు ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మూడు వనే్డల నుంచి వైదొలగిన ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో అజింక్య రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని మరో ఓపెనర్, జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పిటిఐతో మాట్లాడుతూ సూచన ప్రాయంగా తెలిపాడు. తుది జట్టులో అవకాశం దొరకని చాలా మంది సమర్థులు ఉన్నారని, కాబట్టి, ఒక ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకోవడం కష్టం కాదని చెప్పాడు. రహానే కూడా సమర్థుల్లో ఒకడని వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రహానే అద్భుతంగా ఆడాడని, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడని గుర్తుచేశాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రెండో ఓపెనర్‌గా ఎవరు ఉంటారన్నది ప్రధానం కాదని స్పష్టం చేశాడు. పిచ్ తీరు, వాతావరణం వంటి అంశాలే ప్రధాన భూమిక పోషిస్తాయని, ఓపెనింగ్ భాగస్వామి ఎవరైనా తనకు ఒకటేనని చెప్పాడు. ఆరంభం బాగా ఉంటే, మంచి ఫలితాన్ని రాబట్టవచ్చని రోహిత్ అన్నాడు. మరో భాగస్వామి బంతులు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడితే తాను కీలక భూమిక పోషిస్తానని, ఒకవేళ తనకే అలాంటి పరిస్థితి ఉంటే, రెండో ఓపెనర్ ఆ బాధ్యతను స్వీకరిస్తాడని చెప్పాడు. తాము అనుసరిస్తున్న సూత్రం ఇదేనని అన్నాడు. వెస్టిండీస్‌లో రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడని, కాబట్టి, శిఖర్ ధావన్ స్థానంలో అతనిని ఓపెనర్‌గా దించి, లోకేష్ రాహుల్‌కు నాలుగో స్థానం ఖరారు చేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడుతున్నాడని రోహిత్ అన్నాడు. అయితే, తుది నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పాడు. జట్టు ప్రయోజనాలు, అవసరాల మేరకే జట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు. అదే విధంగా బ్యాటింగ్ లైనప్‌ను కూడా పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారిస్తామని తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టు చాలా బలమైనదని అంటూ, పోరు తీవ్రంగా ఉంటుందని రోహిత్ అన్నాడు.
ఆసీస్ జట్టుతో హ్యాండ్స్‌కోమ్ చేరిక
గాయ పడిన ఓపెనర్ ఆరోన్ ఫించ్ భారత్‌తో జరిగే వనే్డ సిరీస్‌లో ఒకటిరెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో, అతని స్థానంలో పీటర్ హ్యాండ్స్‌కోమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎంపిక చేసింది. ఆదివారం జరిగే మొదటి వనే్డలో హ్యాండ్స్‌కోమ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆడుతున్నప్పుడు ఫించ్ కాలి కండరాలు బెణకడంతో నడవలేకపోయాడు. వెంటనే అతనికి అవసరమైన చికిత్సను అందించారు. అతను కోలుకుంటున్నాడని సిఎ ప్రకటించినప్పటికీ, ముందు జాగ్రత్తగా హ్యాండ్స్‌కోమ్‌ను ఎంపిక చేసింది. కాగా, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడని ఫించ్, మొదటి మూడు వనే్డలకు అందుబాటులో ఉండడం అనుమానంగా ఉందని అంటున్నారు. అందుకే, హ్యాండ్స్‌కోమ్‌ను పంపారన్న వాదన వినిపిస్తున్నది. మొత్తం మీద హార్డ్ హిట్టర్ ఫించ్ తుది జట్టులో లేకపోతే, ఆస్ట్రేలియాకు సమస్యలు తప్పవన్నది వాస్తవం.

చిత్రాలు పిటిఐతో మాట్లాడుతున్న రోహిత్ శర్మ
*చిదంబరం స్టేడియం (చెన్నై)లో ఆదివారం భారత్‌తో జరిగే మొదటి వనే్డ కోసం సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు