క్రీడాభూమి

మన్‌ప్రీత్‌కు పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వచ్చేనెల 11 నుంచి 22వ తేదీ వరకు ఢాకాలో జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టును సాకీ ఇండియా ప్రకటించింది. జట్టు పగ్గాలను మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌కు అప్పగించింది. ఫార్వర్డ్ ఆటగాడు ఎస్వీ సునీల్ వైస్-కెప్టెన్‌గా సేవలు అందిస్తాడు. పలువురు జూనియర్ స్థాయి ఆటగాళ్లను ఇటీవల ఐరోపాలో పర్యటించిన సీనియర్స్ జట్టులోకి తీసుకున్న హాకీ ఇండియా ఇప్పుడు ఆసియా కప్ కోసం యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉన్న జట్టును ఎంపిక చేసింది. ఆకాశ్ చిక్టే, సూరజ్ కర్కెరా తమ స్థానాలను పదిలం చేసుకోగా, ఐరోపా టూర్ నుంచి విశ్రాంతినిచ్చిన హర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్‌కు మళ్లీ జట్టులో అవకాశం కల్పించారు. సర్దార్ సింగ్, సునీల్, ఆకాశ్‌దీప్ సింగ్, సత్బీర్ సింగ్ వంటి సీనియర్లు కూడా జట్టులో ఉన్నారు. జట్టు అన్ని విధాలా సమతూకంగా ఉందని చీఫ్ కోచ్ జోర్డ్ మరిజ్నే వ్యాఖ్యానించాడు.
జట్టు వివరాలు
గోల్‌కీపర్లు: ఆకాశ్ చిక్టే, సూరజ్ కర్కెరా.
డిఫెండర్లు: దిస్పాన్ టిర్కీ, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్.
మిడ్‌ఫీల్డర్లు: ఎస్‌కె ఉతప్ప, సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లెన్సానా సింగ్, సుమీత్.
ఫార్వర్డ్స్: ఎస్వీ సునీల్ (వైస్-కెప్టెన్), ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, గుర్జంత్ సింగ్, సత్బీర్ సింగ్.