క్రీడాభూమి

టి-20లో ఇంగ్లాండ్‌పై విండీస్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్టర్ లీ స్ట్రీట్, సెప్టెంబర్ 17: ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌ని వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఇంతకు ముందు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-2 తేడాతో చేజార్చుకున్న వెస్టిండీస్ టి-20 ఫార్మాట్‌లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ, 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు క్రిస్ గేల్, ఇవిన్ లూయిస్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు మెరుపు వేగంతో 77 పరుగులు జోడించిన తర్వాత గేల్ రనౌటయ్యాడు. 21 బంతులు ఎదుర్కొన్న అతను మూడు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. లూయిస్ 28 బంతుల్లో 51 పరుగులు చేసి, లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. అతని స్కోరులో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఆతర్వాత రోవ్‌మన్ పావెల్ (28), ఆష్లే నర్స్ (13 నాటౌట్) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోగ్గ స్కోర్లు చేయలేకపోయారు. మొత్తం మీద వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 176 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.
తొలి బంతికే వికెట్
వెస్టిండీస్‌ను ఓడించి, టి-20 ఫార్మాట్‌లోనూ ఆధిపత్యాన్ని కనబరచాలన్న పట్టుదలతో లక్ష్య ఛేదనను ఆరంభించిన ఇంగ్లాండ్ తొలి బంతిలోనే జాసన్ రాయ్ వికెట్‌ను కోల్పోయింది. జేరోమ్ టేలర్ బౌలింగ్‌లో ఎవిన్ లూయిస్ క్యాచ్ పట్టగా అతను అవుటయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ కూలినప్పటికీ, ఫస్ట్ డౌన్ ఆటగాడు జో రూట్‌తో కలిసి అలెక్స్ హాలెస్ స్కోరుబోర్డును ముందుకు దూకించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. కేవలం 17 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసిన హాలెస్‌ను కార్లొస్ బ్రాత్‌వెయిట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో జొస్ బట్లర్ (30), జానీ బెయిర్‌స్టో (27), లియామ్ ప్లంకెట్ (18) విండీస్ బౌలింగ్‌ను కొంత వరకూ ప్రతిఘటించినప్పటికీ, జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. కెస్రిక్ విలియమ్స్, కార్లొస్ బ్రాత్‌వెయిట్ చెరి మూడు వికెట్లు పడగొట్టగా, సునీల్ నారైన్‌కు రెండు వికెట్లు లభించాయి. ఇక ఇంగ్లాండ్‌తో విండీస్ ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడుతుంది.