క్రీడాభూమి

థోనీకి పద్మభూషణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తోపాటు చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌కు టైటిళ్లను అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మభూషణ్ లభించే అవకాశాలున్నాయి. దేశానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతనిని ఈ పురస్కారంతో గౌరవించాలని ప్రతిపాదిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కేంద్రానికి లేఖ రాసింది. ఈసారి పద్మ అవార్డులకు బిసిసిఐ ధోనీ పేరును మాత్రమే ప్రతిపాదిస్తున్నదని, ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా ఆమోదించామని బిసిసిఐ అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ అవార్డుకు అతని కంటే మెరుగైన వ్యక్తిని తాము సూచించలేమని అతను వ్యాఖ్యానించాడు. బోర్డు సభ్యులంతా ధోనీకి ఈ పురస్కారం లభించాలనే కోరుతున్నారని చెప్పాడు. గతంలో పద్మ భూషణ్ అవార్డు సచిన్ తెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, చందూ బోర్డే, ప్రొఫెసర్ డిబి దేవధర్, కల్నల్ సికె నాయుడు, లాలా అమర్‌నాథ్‌తోపాటు కెరీర్‌లో 13 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాజా భలీంద్ర సింగ్, విజయనగరం మహారాజు విజయ ఆనంద్‌కు లభించింది. ఈ క్రికెటర్ల సరసన ధోనీ కూడా చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.
వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన ధోనీని అత్యుత్తమ ఫినిషర్స్‌లో ఒకడిగా పేర్కొంటారు. ఒత్తిడికి గురికాకుండా, మైదానంలో ఎప్పుడూ సంయమనంతో వ్యవహరిస్తాడు కాబట్టే 3మిస్టర్ కూల్2 అన్న పేరును సంపాదించాడు. 2004 డిసెంబర్ 23న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వనే్డల్లో అరంగేట్రం చేసిన ధోనీ, 2005 డిసెంబర్ 2 నుంచి 6 వరకు శ్రీలంకతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.2006 డిసెంబర్ ఒకటిన అతను జొహానె్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై తొలి టి-20 ఇంటర్నేషనల్ ఆడాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 302 వనే్డలు ఆడిన అతను 74 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, 9,737 పరుగులు సాధించాడు. అజేయంగా 183 పరుగులు అతని అత్యధిక స్కోరు. 10 శతకాలు, 66 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. 745 ఫోర్లు, 212 సిక్సర్లు కొట్టిన అతను 285 క్యాచ్‌లు పట్టాడు. 101 స్టంపింగ్స్ చేశాడు. టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అతను 90 మ్యాచ్‌లు ఆడి, 16సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 4,876 పరుగులు చేసిన అతనికి టెస్టుల్లో అత్యధిక స్కోరు 224. ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు. 544 ఫోర్లు, 78 సిక్సర్లు కొట్టాడు. 256 క్యాచ్‌లు పట్టి, 38 స్టంపింగ్స్ చేశాడు. టి-20 ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే అతను 78 మ్యాచ్‌లు ఆడాడు. 34 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. 1,212 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 56 పరుగులు. 83 ఫోర్లు, 36 సిక్సర్లు సాధించిన అతను 43 క్యాచ్‌లు పట్టి, 24 స్టంపింగ్స్ చేశాడు.
చాలా అరుదుగా, సరదాగా బౌలింగ్ చేసే అతను టెస్టుల్లో 96, వనే్డల్లో 36 బంతులు వేశాడు. టెస్టు ఫార్మాట్‌లో 67 పరుగులు ఇచ్చిన అతను వనే్డల్లో 31 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా సాధించడం విశేషం. అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న అతనికి 2019 వరల్డ్ కప్‌లో ఆడే సత్తా ఉందని పరిశీలకుల అభిప్రాయం.