క్రీడాభూమి

నిబంధనావళిపై స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తమ ఆదేశాలను పాటించి, వెంటనే కొత్త నిబంధనావళిపై స్పందించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనావళిని మార్చక తప్పదని, దీనిపై సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసని స్పష్టం చేసింది. ఇక ముందు కూడా ఇదే తరహాలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే, కఠినంగా వ్యవహరించక తప్పదని పేర్కొంది. వెంటనే స్పందించాలని, లోధా కమిటీకి అన్ని వివరాలను సమర్పించాలని సూచించింది. బిసిసిఐ అధ్యక్షుడు సికె ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి వ్యవహార శైలిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనావళిని మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది.