క్రీడాభూమి

ఏ స్థానమైనా ఒకటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, సెప్టెంబర్ 25: బ్యాటింగ్ ఆర్డర్ ఏదైనా, సాధ్యమైనంత వరకూ నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తానని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వనే్డలో అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సహజంగా ధోనీ తర్వాత, ఏడో స్థానంలో మైదానంలోకి వచ్చే అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రమోషన్ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పాండ్య 72 బంతుల్లో 78 పరుగులు సాధించి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. కాగా, ఈ మార్పుపై అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగామన్నది ప్రధానం కాదని, ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడి, జట్టుకు ఉత్తమ సేవలు అందించడమే కీలకమని వ్యాఖ్యానించాడు. భారీ సిక్సర్లు కొట్టడం తనకు చిన్నతనం నుంచి అలవాటేనని, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కొడుతున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. చెన్నైలో జరిగిన మొదటి వనే్డలో ఆడం జంపా ఆడుతున్న విషయాన్ని గమనించానని, అందుకే, ఏడో ఓవర్‌లో అతను బౌలింగ్‌కు దిగే వరకూ సహనంతో నిరీక్షించానని పాండ్య చెప్పాడు. జంపా బౌలింగ్‌లో బంతిని పదేపదే బౌండరీకి తరలించడం ద్వారా పరుగులు రాబట్టానని, ఒక రకంగా ఆ ఆటే తర్వాత మ్యాచ్‌ని కీలక మలుపు తిప్పిందని అన్నాడు. ఎప్పుడూ దూకుడుగా ఉండడం సాధ్యం కాదని, పరిస్థితులను బట్టి ఆటతీరును మార్చుకుంటానని చెప్పాడు. కాగా, పాండ్య వనే్డల్లో తన రెండో అత్యుత్తమ స్కోరును ఆదివారం నమోదు చేశాడు. చెన్నైలో అతను 66 బంతుల్లో 83 పరుగులు చేయగా, మూడో వనే్డలో 78 పరుగులు సాధించాడు. నాలుగో స్థానంలో అతనికి ఇదే మొట్టమొదటి అర్ధ శతకం. అతను తన కెరీర్‌లో సాధించిన నాలుగు అర్ధ శతకాలు కూడా ఈ ఏడాది నమోదైనవే కావడం గమనార్హం. ఆసీస్‌పై ఈ మూడు వనే్డల్లో అతను 60.33 సగటుతో మొత్తం 181 పరుగులు సాధించాడు. ప్రస్తుత సిరీస్‌లో ఇరు జట్లలోనూ ఇంకెవరీ ఇంత కంటే మెరుగైన సగటును నమోదు చేయలేదు. కాగా, ఆదివారం నాటి మ్యాచ్‌లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఎంపిక కావడం అతనికి ఇది మూడోసారి. 2016 అక్టోబర్ 16న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డలో అతను మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించాడు. తాజా సిరీస్‌లోనే, చెన్నైలో జరిగిన మొదటి వనే్డలోనూ అతనికి ఈ అవార్డు లభించింది.

చిత్రం..భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య