క్రీడాభూమి

ఒక్కటైన ప్రత్యర్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేగ్, సెప్టెంబర్ 25: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థుల జాబితాలో ముందు వరుసలో నిలిచే రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ ఒక్కటయ్యారు. ఇద్దరూ ఒకే జట్టుగా పోటీపడ్డారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇక్కడ జరిగిన లెవర్ కప్ టెన్నిస్ టీం వరల్డ్ పోటీల్లో వీరు డబుల్స్ భాగస్వాములుగా బరిలోకి దిగారు. చివరి లీగ్ మ్యాచ్‌లో జాక్ సాక్, సామ్ క్వెర్రీ జోడీని 6-4, 1-6, 10-5 తేడాతో ఓడించి, మొత్తం మీద 9-3 ఆధిక్యంతో టాపర్‌గా నిలవడం ద్వారా టైటిల్ అందుకున్నారు. ఈ ఫలితం ఎలావున్నా, టెన్నిస్ కోర్టుల్లో ఎప్పుడూ బద్ధ శత్రువులుగా అమీతుమీ తేల్చుకోవడానికి పోరాటం సాగించే ఇద్దరు స్టార్లు ఒక్కటిగా జత కట్టడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే, భవిష్యత్తులో, ఇతర టోర్నీల్లో డబుల్స్ భాగస్వాములుగా కొనసాగుతారా అన్న ప్రశ్నకు ఇద్దరూ లేదని సమాధానమిచ్చారు.

చిత్రం..ప్రేగ్‌లో జరిగిన లెవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ టీం టైటిల్‌ను సాధించిన ఐరోపా జట్టు. చిత్రంలో టెన్నిస్ లెజెంట్ రాడ్ లెవర్ కూడా ఉన్నాడు